స్టార్ హీరోయిన్‌కి పెను ప్రమాదం.. తలకి 13 కుట్లు, బ్యాండేజ్‌తో ఫోటోలు లీక్
సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులు అప్పుడప్పుడు ప్రమాదాల బారినపడుతుంటారు. ఎన్నో షూటింగ్స్‌లో యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కోల్పోయినవారు, అంగవైకల్యం పొందిన వారికి లెక్కేలేదు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌కి యాక్సిడెంట్ జరగడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించి తలకు దాదాపు 13 కుట్లు వేయడంతో గండం గడిచింది. ఆ నటి ఎవరో కాదు.. 90వ దశకంలో భారతదేశాన్ని ఊపేసిన భాగ్యశ్రీ.
మహారాష్ట్రలోని సాంగ్లీలో రాజ కుటుంబంలో జన్మించిన భాగ్యశ్రీ అసలు పేరు భాగ్యశ్రీ పట్వార్ధన్ దాసాని. సాంగ్లీ సంస్థానాన్ని పరిపాలించిన చింతామన్‌రావ్ దుండిరావ్ పట్వార్ధన్ మనవరాలే భాగ్యశ్రీ. చింతామన్ తర్వాత భాగ్యశ్రీ తండ్రి విజయ్ సింగ్‌రావ్ మాధవరావ్ పట్వార్ధన్ సింహాసనాన్ని అధిష్టించారు. 1989లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన మైనే ప్యార్ కియా సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన భాగ్యశ్రీ తన తొలి సినిమాతోనే దేశాన్ని ఊపేశారు.

క్యూట్ లుక్స్, అందమైన చిరునవ్వుతో ఆమె కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు. కేవలం భాగ్యశ్రీని చూడటం కోసమే అప్పట్లో యూత్ ఈ సినిమాకు వెళ్లారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో నటనకు గాను బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కించుకున్నారు భాగ్యశ్రీ. ఆ తర్వాత త్యాగి, పాయల్, సినిమాలలో నటించారు.
డాక్టర్ రాజశేఖర్ హీరోగా ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఓంకారం సినిమాతో తెలుగు వారిని పలకరించారు భాగ్యశ్రీ. ఆ తర్వాత యువరత్న రాణా సినిమాలో బాలకృష్ణకు చెల్లెలిగా నటించారు. 2003లో అవునా అని చిత్రంతో తెలుగులో నటించిన భాగ్యశ్రీ .. దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్‌తో మరోసారి తెలుగువారిని పలకరించారు. 1989లోనే హిమాలయ దసానిని భాగ్యశ్రీ పెళ్లాడారు. ఈ దంపతులకు అభిమన్యు దసాని, అవంతిక దసాని సంతానం. వీరిద్దరినీ హీరో, హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం చేసే పనిలో భాగ్యశ్రీ బిజీగా ఉన్నారు.
2023లో నాలుగు సినిమాల్లో నటించిన భాగ్యశ్రీ ఆ తర్వాత కొత్తగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 60కి చేరువ అవుతున్నా ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. కుర్ర హీరోయిన్లే అసూయపడే స్థాయిలో అందాలను మెయింటైన్ చేస్తూ కవ్విస్తున్నారు భాగ్యశ్రీ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే పలు అంశాలపైనా తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. మంచి కథ, ప్రాథాన్యమున్న పాత్ర దొరికితే ఖచ్చితంగా నటిస్తానని భాగ్యశ్రీ పలుమార్లు తెలిపారు.
ఇదిలాఉండగా.. పికిల్ బాల్ ఆడుతుండగా భాగ్యశ్రీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు, తలకి బ్యాండేజ్‌తో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీకి దాదాపు 13 వరకు కుట్లు వేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











