Don't Miss!
- News
నందమూరి తారకరత్నకు నేడు మరోమారు కీలక వైద్యపరీక్షలు.. తర్వాతే స్పష్టత; అందరిలో టెన్షన్!!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అతడితో లిప్ లాక్ అనగానే గుండెపోటు వచ్చింది.. కిస్ ఇచ్చాక నవ్వేశారు: సీనియర్ నటి
బిపాషా బసు అనగానే లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా గుర్తొస్తాయి. ఐదేళ్ల క్రితం ఈ బ్యూటీ బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంది. పోటీగా ఎంత మంది స్టేట్ హీరోయిన్స్ ఉన్నా కూడా బిపాషా ఒక్క ఐటెమ్ సాంగ్ తో జనాలను తనవైపుకు తిప్పుకునేది. ఇక లిప్ లాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి సీన్స్ లో ఎంతో అనుభవం ఉన్న బిపాసా ఒక నటుడికి లిప్ లాక్ ఇవ్వడానికి మాత్రం చాలా ఆందోళనకు గురయ్యిందట.

బోల్డ్ సీన్స్ తోనే..
బిపాషా బసు సినిమాలో ఉందంటే చాలు.. ఒక స్పెషల్ సాంగ్, అలాగే బెడ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ కూడా గట్టిగా ఉంటాయనే టాక్ అప్పట్లో బాగానే వినిపించేది. ఇక అలాంటి బోల్డ్ సీన్స్ తోనే అమ్మడు సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేసేది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బిపాషా తన కెరీర్ కో సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టేసింది.

అతనితో లిప్ లాక్ అనగానే..
ముఖ్యంగా హీరో మాధవన్ తో లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది. ఎందుకంటే అంతకుముందు నుంచే మాధవన్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ సడన్ గా అతనితో నటించే అవకాశం రావడంతో లిప్ లాక్ సీన్ కూడా చేయవలసి వచ్చిందని బిపాసా వివరణ ఇచ్చింది. ఇక షూటింగ్ మొదలయ్యే ముంది రోజే హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయినట్లు తెలిపింది.

కిస్ ఇచ్చిన తరువాత నవ్వేశారు.
'2012లో నేను మాధవన్ జోడి బ్రేకర్స్ అనే బాలీవుడ్ సినిమాలో నటించాము. ఇక నేను అతనికి కిస్ చేయాల్సిన సమయం రాగానే చాలా ఆందోళన కలిగింది..లిప్ లాక్ అనగానే ఓ చిన్నపాటి గుండెపోటు కూడా వచ్చింది. ఎందుకంటే అతను నా బెస్ట్ ఫ్రెండ్. లిప్ కిస్ ఇచ్చిన తరువాత అందరూ నవ్వేశారు. మాధవన్ కూడా గట్టిగా నవ్వేశాడు' అని బిపాషా తెలియజేసింది.

డేంజరస్ వెబ్ సిరీస్
ఇక బిపాషా బసు చాలా కాలం తరువాత మళ్ళీ యాక్టింగ్ పై దృష్టి పెట్టింది. గత నాలుగేళ్ళుగా నటనకు దూరంగా ఉంటున్న బిపాసా ఇటీవల డేంజరస్ అనే వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేసింది. బిపాసా భర్త కరణ్ సింగ్ కూడా అందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ముందు ముందు మరిన్ని బోల్డ్ వెబ్ సిరిస్ లతో ఆడియెన్స్ ని సరికొత్తగా ఆకట్టుకోవాలని ఈ బ్యూటీ ప్లాన్ చేసుకుంటోంది.