గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్ .. 70 ఏళ్ల నటితో పోలుస్తూ దారుణంగా?
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోయిన్‌ల లిస్ట్ తీస్తే అందులో బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనె పేరు ముందు వరుసలో ఉంటుంది. తన అందం, అభినయంతో తక్కువ సమయంలోనే ఇండియాలోనే లీడింగ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు దీపిక. పొడుగు కాళ్ల సుందరిగా , సొట్ట బుగ్గల బ్యూటీగా అభిమానులు ఆమెను ముద్దుగా పిలుచుకుంటూరు . గతేడాది ఆమె జీవితంలో ఎన్నో మరుపురాని ఘటనలు చోటు చేసుకున్నాయి.
5 జనవరి 1986న డెన్మార్క్‌లోని కోపెన్ హెగన్‌లో జన్మించారు దీపికా పదుకొనే. తత్లిదండ్రులు ప్రకాష్ పదుకొనే, ఉజాలా. ప్రకాష్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాగా తల్లి ట్రావెల్ ఏజెంట్. దీపికకు అనిషా అనే చెల్లి కూడా ఉండగా ఈమె గోల్ఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బెంగళూరులోని సోపియా హైస్కూల్, మౌంట్ కార్మెల్ కాలేజీలో దీపికా పదుకొనే చదువుకున్నారు. అయితే మోడలింగ్‌లో బిజీ కావడంతో ఆమె ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సోషియాలజీలో డిగ్రీ పట్టా అందుకున్నారు.

2006లో తన మాతృభాష కన్నడంలో తెరకెక్కిన ఐశ్వర్య అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు దీపికా పదుకొనె. దీని తర్వాత తన మకాంను బెంగళూరు నుంచి ముంబైకి మార్చిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఓం శాంతి ఓం, లవ్ ఆజ్ కాల్, హౌస్‌ఫుల్, డమ్ మారో దమ్, కాక్‌టెయిల్, రేస్, దేశీ బాయ్స్, బాంబే టాకీస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూఇయర్, పీకూ, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, జీరో, బ్రహ్మస్త్ర పార్ట్ 1, పఠాన్, జవాన్, ఫైటర్ , సింగమ్ ఎగైన్ చిత్రాలతో బాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా గతేడాది విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమాతో తెలుగులోనూ అడుగుపెట్టారు దీపికా పదుకొనే.
సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వాణిజ్య ప్రకటనలు, వ్యాపారాల ద్వారా దీపిక రూ.కోట్లకు పడగలెత్తారు. ఆమె ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పై మాటే. ఏడాదికి రూ. 50 కోట్ల పైనే దీపిక సంపాదిస్తున్నారని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె ఈ ఏడాది సెప్టెంబర్‌లో పండండి ఆడపిల్లకు జన్మనిచ్చి అభిమానులకు పండుగ తెచ్చారు. గర్భం దాల్చినప్పటికీ సినిమాలు చేసి వృత్తిపై తన అంకిత భావాన్ని చాటుకున్నారు దీపిక. నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీలో నటించారు. ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కల్కి ప్రమోషనల్ ఈవెంట్లకు కూడా హాజరై శెభాష్ అనిపించుకున్నారు.
International 🔥 Deepika walking the ramp after a gap but still the supermodel uff yaasss!! #DeepikaPadukone pic.twitter.com/zZngQFWcnF
— Banno 🇮🇳 (@BannoReBanno) January 25, 2025
డెలివరీ తర్వాత భర్త, కూతురితో గడుపుతూ మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తున్నారు దీపిక పదుకొనె. బహిరంగంగానూ కనిపించింది చాలా తక్కువే. సోషల్ మీడియాకు కూడా ఈ ముద్దుగుమ్మ దూరమయ్యారు. తాజాగా సబ్యసాచి 25వ ఫ్యాషన్ షోకు హాజరైన దీపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైట్ కలర్ డ్రెస్‌లో క్రాస్ నెక్లెస్, బ్రాస్‌లెట్, కళ్లజోడుతో స్టైలీష్‌గా ర్యాంప్ వాక్ చేశారు. అయితే డెలివరీ తర్వాత శరీరంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా కాస్త బొద్దుగా మారడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా బాలీవుడ్ సీనియర్ నటి రేఖతో పోలుస్తూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రభాస్ కల్కి 2 త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో దీపిక అప్పటికీ బరువు తగ్గుతారని వాదనలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











