Oscars 2023: ఆస్కార్ అవార్డు వేడుకలో దీపికా.. అరుదైన గుర్తింపు!
అందం, అభినయంతో మోడలింగ్ ప్రపంచంలో గుర్తింపు అందుకున్న తరువాత దీపికా పదుకొణె.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇక 2006లో కన్నడ సినిమా ఐశ్వర్యతో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈమె ఇప్పటికీ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఆమె తాజాగా ఇన్ స్టా వేధికగా ఓ పోస్టు పెట్టింది.
అందులో 95వ ఆస్కార్ అవార్డులు ప్రెజెంట్ చేస్తున్న సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. అయితే దాంట్లో దీపికా కూడా ఉన్నట్లు పోస్టులో వెల్లడించింది. అందరు సమర్పకుల పేర్లతో ఉ్నన ఓ ఫొటోను దీపికా తన అభిమానులతో పంచుకుంది. అయితే అవార్డు ప్రెజెంటర్లలో రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, ట్రాయ్ కొట్సూర్, డ్వేన్ జాన్సన్, జెన్నిఫర్ కన్నెల్లీ, శామ్యూల్ ఎల్. జాక్సన్, మెలిస్సా మెక్‌కార్తీ, జో సల్దానా డోనీ యెన్, జోనాథన్ మేజర్స్ మరియు క్వెస్ట్‌లోవ్ ఉన్నారు. ఈ జాబితాలోనే దీపికా పేరు కూడా ఉంది.

95వ ఆస్కార్ అకాడమీ అవార్డులు మార్చి 12న (భారతదేశంలో మార్చి 13న) లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్నాయి. దీపికా ఈ పోస్టును షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇక నేహా ధూపియా దిపికా పోస్టుపై స్పందించారు. ఆస్కార్ వేధికపై నిన్ను చూసేందుకు నేను వేచి ఉంటాను దీపూ అంటూ నేహా ధూపియా కామెంట్ చేశారు. అలాగే చాలా మంది అభిమానులు దీపికకు కంగ్రాట్స్ చెప్పారు. ఆస్కార్ వేధికపై పఠాన్ అమ్మాయి అని ఓ అభిమాని కామెంట్ చేయగా... మరో అభిమాని "ఈ టైమ్ మాది దీపికా మామ్" అని రాసుకొచ్చారు.
కేవలం ఇన్ స్టా అకౌంట్ లోనే దీపికా పదుకొణెకు 72.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె 372 పోస్టులు షేర్ చేయగా.. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు, షేర్లు వచ్చాయి. కేవలం ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలనే కాకుండా దీపికా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేధికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను ఫాలో అయ్యేందుకు లక్షలాది మంది అభిమానులు ముందుకొస్తుంటారు. ఆమె చేసే ప్రతీ పోస్టుపై స్పందిస్తూ సపోర్ట్ చేస్తుంటారు.


Click it and Unblock the Notifications











