భర్తకు టాప్ హీరోయిన్ గుడ్‌బై.. 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.. గుండె పగిలే బాధతో

బాలీవుడ్‌లో విడాకులు పర్వం టెలివిజన్ సీరియల్‌లా కొనసాగుతున్నది. హృతిక్, అర్జున్ రాంపాల్ దంపతులు విడిపోవడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా జడ్జిమెంటల్ హై క్యా రచయిత కణిక, ప్రకాశ్ కోవెలమూడి డైవోర్స్‌ను జీర్ణించుకోకముందే మరో హీరోయిన్ 11 ఏళ్ల వివాహబంధానికి గుడ్ చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాను విడాకులు తీసుకొన్న విషయాన్ని బాలీవుడ్ నటి దియా మిర్జా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

హృదయం ముక్కలయ్యే విధంగా

హృదయం ముక్కలయ్యే విధంగా

11 ఏళ్ల క్రితం సాహిల్ సంఘాతో దియా మిర్జాకు వివాహం జరిగింది. ఇటీవల తాము విడిపోయామని హృదయం ముక్కలయ్యే విధంగా సోషల్ మీడియాలో ఓ లేఖను పెట్టింది. నా జీవితంలో ఇప్పటి వరకు సహకరించిన ప్రతీ ఒక్కరు ఎప్పటిలానే సపోర్ట్‌ను అందించాలి అని ఇన్స్‌టాగ్రామ్‌లో రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం భావోద్వేగాల మధ్య ఉన్నామని, మా ప్రశాంతతకు భంగం కలిగించకూడదు అని వేడుకొన్నారు.

 సవ్యంగానే వివాహ బంధం

సవ్యంగానే వివాహ బంధం

11 ఏళ్ల దాంపత్య జీవితం సవ్యంగా సాగిపోయింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అవగాహనతో మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకొన్నాం. విడాకుల తర్వాత మేమిద్దరం స్నేహితుల మాదిరిగానే కొనసాగాలని నిర్ణయించుకొన్నాం. మా ఇద్దరికి ఒకరంటే మరొకరికి ప్రేమ, గౌరవం ఉంది. ఇక మా జీవన ప్రయాణం రెండు వేర్వేరు మార్గాల్లో కొనసాగుతుంది అని దియా మిర్జా పేర్కొన్నారు.

మా బంధం అద్భుతమైందని

మా బంధం అద్భుతమైందని

ఇప్పటి వరకు మా మధ్య ఉన్న బంధం అత్యంత గొప్పగా, అద్భుతమైన అనుభూతితో కలిగి ఉంది. మా జీవన ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాం. మా విడాకులపై మేమిద్దరం ఏ పరిస్థితుల్లోనూ కామెంట్ చేయకూడదని పరస్పర అవగాహనతో ఉన్నాం. థ్యాంక్యూ.. ఇట్లు మీ దియా మిర్జా, సాహిల్ సంఘా అని ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేశారు.

వాయిదాలతో దియా మిర్జా పెళ్లి

వాయిదాలతో దియా మిర్జా పెళ్లి

బాలీవుడ్ నటి దియా మిర్జా, సాహిల్ సంగా అక్టోబర్ 18, 2014లో వివాహం చేసుకొన్నారు. వారి వివాహానికి ముందు కొన్ని కారణాల వల్ల రెండుసార్లు వాయిదా పడింది. మార్చి 11, 2019లో ఆకాష్ అంబానీ వివాహం సందర్భంగా మీడియాకు జంటగా కనిపించారు. ఈ దంపతులకు బార్న్ ఫ్రీ ఎంటర్టైన్‌మెంట్ అనే సినీ నిర్మాణ సంస్థ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X