Disha Patani: బాత్రూమ్ లో టాప్ తీసేసి.. సన్నని బికినీలో షాక్ ఇచ్చిన హీరోయిన్!
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటాని గ్లామర్ ప్రజెంటేషన్ లో ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిస్తోంది. బికినీ అందాలతో ఆమె ఇదివరకే చాలాసార్లు కనిపించింది. అయితే ఈసారి గ్లామర్ డోస్ ను మరింత పెంచి కుర్రాళ్లకు మతిపోయేలా చేసింది. రీసెంట్ గా ఆమె బాత్రూం లో ఇచ్చిన స్టిల్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. దిశా పటాని రేంజ్ ఏ స్థాయిలో ఉందో ఆ ఫోటో వైరల్ అయిన విధానం చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఫోటో వివరాలలోకి వెళ్తే..

ఎక్కువగా గ్లామర్ తోనే..
దిశా పటాని గురించి సోషల్ మీడియా జనాలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఇంటర్నెట్ ప్రపంచంలో తరచుగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఎక్కువగా గ్లామర్ తోనే తన రేంజ్ ను పెంచుకుంటుంది. ప్రతిసారి ఆమె విభిన్నమైన ఫోటోషూట్ చేస్తూ కుర్రాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకు మరింత పెరుగుతుంది.

తెలుగులో అలా..
దిశాపటాని తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమైన విషయం తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆమెకు తెలుగులో సరైన గుర్తింపు దక్కలేదు. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమెకు టాలీవుడ్ ఆఫర్స్ కూడా పెద్దగా వచ్చింది లేదు. కానీ గ్లామర్ తో మాత్రం మంచి గుర్తింపు అయితే లభించింది. అందుకే బాలీవుడ్ లో ట్రై చేయగానే అక్కడ మంచి ఆఫర్లు వచ్చాయి.

హీరోతో డేటింగ్
బాలీవుడ్ లో దిశాపటాని మొదట ఎంఎస్ ధోని బయోపిక్ లో నటించింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకు వెంట వెంటనే ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ తోనే ఎక్కువగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. కొన్నాళ్ళకు అతనితో ప్రేమలో కూడా పడింది. ఇక డేటింగ్ అనంతరం పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా నిత్యం అక్కడ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఆ విషయంలో ఈ బ్యూటీ పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు.

వరుసగా సినిమాలు
ఇక టైగర్ ష్రాఫ్ తో దిశా పటాని భాగీ 2 సినిమా తో పాటు భాగీ 3 సినిమా కూడా చేసింది. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాయి. ఇక గత ఏడాది అమ్మడు సల్మాన్ ఖాన్ తో రాదే అనే సినిమా చేసింది. అది కరోనా కారణంగా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఏక్ విలన్ రిటర్న్స్ తో కూడా మంచి నటనతో మెప్పించింది.

బికినీ లుక్ వైరల్
ఇక ఇటీవల కాలంలో దిశా పటాని తన గ్లామర్ డోస్ ను మరింత పెంచుతుంది. ఇటీవల అమ్మడు బాత్రూంలో ఒక నల్లని బికినీలో మరింత ఘాటుగా కనిపించింది. గతంలో చాలాసార్లు ఈ బ్యూటీ బికినీలో దర్శనం ఇచ్చినప్పటికీ ఈసారి అంతకుమించి అనేలా షాక్ ఇచ్చింది. దిశా పటాని గ్లామర్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకట్టుకుంటుంది. ఇక ఆమె ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఇంకా ఏ విధంగా దర్శనమిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











