twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విరామం లేకుండా పని.. నటికి గుండె పోటు

    |

    విరామం లేని షూటింగ్ ఆ నటి ప్రాణాల మీదకు తెచ్చింది. గంటల కొద్ది షూటింగ్ చేస్తూ ఉండటం వల్ల నీరసించి పోవడంతో హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలుస్తోంది. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలిసి వెంటనే ముంబైలోని రక్షా ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పుడామె పరిస్థితి సీరియస్ గా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని సమాచారం.

    నిర్విరామంగా షూటింగ్..

    నిర్విరామంగా షూటింగ్..

    ‘గంధీ బాత్' వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన ప్రముఖ టీవీ నటి గెహానా వసిస్త్ తాజాగా ఓ వెబ్ సిరీస్ కోసం వరుసగా 48 గంటల పాటు నటిస్తూ కుప్పకూలిపోయింది. దీంతో షాకైన యూనిట్.. ఆస్పత్రిలో జాయిన్ చేశారు.టైంకు సరైన పోషకాహారం తీసుకోకపోవడం.. సుదీర్ఘంగా షూటింగ్ లో పాల్గొనడం.. అసాధారణమైన పనివేళల కారణంగానే నటికి గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.

    సీరియస్ కండీషన్‌లో నటి..

    సీరియస్ కండీషన్‌లో నటి..

    మధ్ ద్వీపంలో వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్న నటి ఒక్కసారిగా కుప్పకూలగా.. ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. బ్లడ్ షూగర్ లెవల్ పడిపోయిందని, ప్రస్తుతం ఆమెకు ఇప్పుడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోందని తెలిపారు. ఆమె అవయవాలు ఏవీ పనిచేయకపోవడంతో పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని వైద్యులు ప్రకటించారు.

    అందుకే గుండె పోటు..

    అందుకే గుండె పోటు..

    తక్కువ రక్తపోటు తక్కువ బ్లడ్ షుగర్ కారణంగానే గెహానాకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఆమె ఆహారం తీసుకోకుండా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం.. 48 గంటలుగా లేని నిద్ర కారణంగా శరీరంలో రక్తపోటు పడిపోవడానికి కారణమని వైద్యులు తెలిపారు. ఆమె వాడే షుగర్ మాత్రలకు ఎనర్జీ డ్రింక్‌లకు మధ్య ప్రతిచర్య జరిగి గుండెపోటుకు దారితీసిందట..

    Recommended Video

    #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
    చికిత్స అందిస్తున్న వైద్యులు..

    చికిత్స అందిస్తున్న వైద్యులు..

    గెహానాను బతికించడానికి వైద్యులు ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చినా ఆమె శరీరం స్పందించడం లేదని తెలుస్తోంది. శ్వాస కూడా తీసుకోకపోవడం ఇబ్బందికరంగా మారిందని, ఆమె మెదడుకు సరైన ఆక్సిజన్ అందకపోవడంతో వెంటీలేటర్‌పై చికిత్సనందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈమె చావు బతుకల మధ్య కొట్టుమిట్టాడుతోందని తెలుస్తోంది.

    English summary
    Bollywodd Actress Gehana Got Hospitalised. She Had Cardiac Attack And Become Serous Now. actress Gehana Vasisth was admitted to a hospital in Malad after she suffered a cardiac arrest on the set of a web series in Madh Island. There were reports about her being on ventilator.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X