షాకిచ్చిన డ్రీమ్ గర్ల్.. ఆస్తుల లెక్క ఎంతో తెలుసా!
Recommended Video

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హెడావిడి నెలకొని ఉంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎన్నికల్లో సెలబ్రిటీల సందడి కనిపిస్తోంది. వివిధ రాజకీయ పార్టీల తరుపున సినీ క్రీడా ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని కూడా ఒకరు. హేమ మాలిని భారతీయ జనతా పార్టీ తరుపున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ లో భాగంగా ఆమె తన ఆస్తులని అఫిడవిట్ లో పొందుపరిచారు. హేమ మాలిని ఆస్తుల వివరాలు అందరికి షాకిచ్చేలా ఉన్నాయి.

ఎంపీ అభ్యర్థిగా
హేమ మాలిని బిజెపి తరుపున ఉత్తరప్రదేశ్ లోని మధుర నగర ఎంపీ అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. హేమ మాలిని ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండవసారి పోటీలో నిలిచారు. ఎన్నికల అఫిడవిట్ లో హేమ మాలిని ఆస్తుల వివరాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ ఐదేళ్లలో తన ఆస్తులు 34 కోట్లకు పైగా పరిగినట్లు హేమ మాలిని పేర్కొంది.

మొత్తం ఆస్తి ఏంటంటే
హేమమాలిని ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఆస్తుల విలువ 101 కోట్లు. 2004 నుంచి హేమమాలిని బీజేపీలో ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నామినేషన్ లో ఆమె తన ఆస్తులని 66 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం ఆమె బంగారం, స్థిర, చర అన్ని ఆస్తుల విలువ 101 కోట్లకు చేరింది. తన భర్త ధర్మేంద్ర ఆస్తులతో కలిపి ఇద్దరికీ 123 కోట్లు ఉన్నట్లు హేమ మాలిని పేర్కొంది.

బాలీవుడ్‌లో టాక్
హేమమాలిని గతంలో 58 కోట్ల విలువైన ఓ బంగ్లాని కొనింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం కేవలం ఆ బంగ్లా, భూమి విలువే 100 కోట్లకు పైగా ఉంటుందని బాలీవుడ్ లో టాక్. కానీ హేమ మాలిని పాత లెక్కలనే చూపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఐదేళ్లలో తన ఆస్తులు 34 కోట్లు పెరగగా, ధర్మేంద్ర ఆస్తులు 10 కోట్లు పెరిగినట్లు హేమమాలిని అఫిడవిట్ లో పొందుపరిచింది.

వాహనాల వివరాలు
తనకు రెండు కార్లు ఉన్నట్లు హేమమాలిని తెలిపింది. 33 లక్షల విలువైన మెర్కడ్జ్ కారు, 5 లక్షల విలువైన టొయోట కారు ఉన్నట్లు హేమమాలిని చూపించింది. ఇక తన భర్త ధర్మేంద్ర వద్ద రేంజ్ రోవర్ కారు, కొన్ని వింటేజ్ కార్లు ఉన్నట్లు పేర్కొంది. ఇలా చాలా మంది ప్రముఖుల ఆస్తుల వివరాలు ఈ ఎన్నికల సందర్భంగా బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ లో డ్రీమ్ గర్ల్ గా వెలుగు వెలిగిన హేమమాలిని ప్రస్తుతం 100 కోట్లకు అధిపతి.


Click it and Unblock the Notifications











