అక్కినేని నాగార్జున 14 సార్లు నా చెంప పగలగొట్టారు.. బాలీవుడ్ నటి ఆవేదన

టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో అక్కినేని నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 3 దశాబ్దాలుగా హీరోగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఆరు పదుల వయస్సు దాటినా కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున కెరీర్ ప్రారంభం సౌత్ నటీమణులతోనే కాకుండా బాలీవుడ్ హీరోయిన్లతోనూ నటించి మెప్పించారు. తెలుగు ప్రేక్షఖులకు నార్త్ అందాలను పరిచయం చేశారు కూడానూ. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటి ఇషా కొప్పికర్ తో అక్కినేని నాగార్జున ఒక చిత్రంలో నటించారు. ఆ సమయంలో నాగార్జున చేసిన పనిని బాలీవుడ్ నటి తాజాగా వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ తోనే ఇషా కొప్పికార్ కెరీర్..
బాలీవుడ్ నటి ఇషా కొప్పికార్ కెరీర్ తెలుగు చిత్రాలతోనే ప్రారంభం అయ్యింది. 1997 నుంచి ఆమె సినీ కెరీర్ ప్రారంభం అయ్యింది. తొలుత వైఫ్ ఆఫ్ వర ప్రసాద్ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే ఈ చిత్రంలో కేవలం స్పెషల్ సాంగ్ తోనే ఆకట్టుకుంది. ఇక నెక్ట్స్ అక్కినేని నాగార్జున సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే తమిళం, కన్నడ భాషల్లోనే 90లలో వరుసగా చిత్రాలు చేసింది. దక్షిణాదిలో నటిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాతనే బాలీవుడ్ లో అడుగుపెట్టింది. 2000 నుంచి హిందీ చిత్రాలతో నార్త్ ఆడియెన్స్ కు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించింది.

Bollywood Actress Isha Koppikar said

అక్కినేని నాగార్జున ఇషా కొప్పికార్ సినిమా..
ఇషా కొప్పికార్ హీరోయిన్ వెండితెరకు పరిచయం అయ్యిందే అక్కినేని నాగార్జున సినిమాతో. అక్కినేని నాగార్జుననే ఈమెకు నటిగా తొలిగా అవకాశం అందించారు. నాగార్జున, ఇషా కొప్పికర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం చంద్రలేఖ. 1998లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మొదటి హీరోయిన్ గా నటించగా, ఇషా కొప్పికర్ రెండో హీరోయిన్ గా నటించి తెలుగు తెరపై అలరించింది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి టాక్ నే సంపాదించుకుంది.

14 సార్లు కొట్టిన నాగార్జున..
చంద్రలేఖ చిత్రం సమయంలో షూటింగ్ లో భాగంగా అక్కినేని నాగార్జున తనను 14 సార్లు చెంపదెబ్బ కొట్టారని తాజాగా నటి ఇషా కొప్పికర్ తెలియజేసింది. నాగార్జున కొట్టిన చెంపదెబ్బలకు తన ముఖంపై మరకలు కూడా ఉండిపోయాయని చెప్పుకొచ్చింది. ఇటీవలి ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

నెక్ట్స్..
ఇషా కొప్పికర్ చాలా కాలం తర్వాత అయాలన్ అనే తమిళం చిత్రంలో నటించి సౌత్ ఫిల్మ్స్ కు రీఎంట్రీ ఇచ్చింది. అదే ఆమె చివరి చిత్రం. 2024లో విడుదలైన ఆ చిత్రం తర్వాత మరే సినిమాను ప్రకటించలేదు. ఇక అక్కినేని నాగార్జున చివరిగా నా సామి రంగ చిత్రంతో హట్ అందుకున్నారు. నెక్ట్స్ రజనీకాంత్ కూలి చిత్రంలో విలన్ గా అలరించబోతున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X