హార్దిక్‌పై మనసు పారేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ
క్రికెట్, సినిమాకు నాటి నుంచి నేడు వరకు విడదీయరాని బంధం ఉంది. వాళ్లంటే..వీళ్లకు .. వీళ్లాంటే.. వాళ్లకు పిచ్చి. షర్మిలా ఠాగూర్- టైగర్ పటౌడి జంట నుంచి నేటీ అనుష్క శర్మ- విరాట్ కోహ్లి వరకు ఎన్నో జంటలు ప్రేమాయణం కొనసాగించాయి. కొన్ని జంటలు తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్తే.. మరికొన్ని జంటలు మాత్రం మునాళ్ల ముచ్చటగా అంతమయ్యాయి.
మొత్తానికి క్రికెట్ కు, బాలీవుడ్ కు ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉంది. తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంటే.. ప్రేమ, ఆయన నా క్రష్ అంటూ ఓపెన్ గా చెప్సి.. క్రికెట్ + బాలీవుడ్ = 'క్రిక్‌వుడ్' ను తనవైపుకు తిప్పుకున్నది. ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి.
వాస్తవానికి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రధానంగా ఐపీఎల్ 2024 నుంచి కంటిన్యూగా వార్తల్లో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తెగ వైరలవుతున్నారు. కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ వర్సెస్ హార్థిక్ అంటూ వార్తలు రావడంతో కొందరి ద్రుష్టిలో విలన్ గా మారారు.
కానీ, 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలువడంతో హీరోగా మారాడు. ఆ తరువాత తన విడాకుల వార్తలతో మీడియాలో మరోసారి నిలిచారు. ఇదే క్రమంలో అనన్య పాండే, జాస్మిన్ వాలియాతో డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు తాజా ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఏకంగా తనకు హార్థిక్ అంటే.. పిచ్చి అంటూ ఓపెన్ గా సెన్సెషనల్ కామెంట్స్ చేసింది. ఆ బ్యూటీ నే ఇషితా రాజ్.

హర్థిక్ గురించి ఏం చెప్పిందంటే?
తాజాగా బాలీవుడ్ భామ ఇషితా ఓ చిట్ చాట్ లో మాట్లాడుతూ.. 'క్రికెటర్ హార్థిక్ పాండ్యా అంటే తనకు చాలా ఇష్టమనీ, అతను అద్భుతమైన క్రికెటర్.. ఆల్ రౌండర్. అతని బ్యాటింగ్ అంటే.. నాకు చాలా చాలా ఇష్టం. హార్దిక్‌ను ప్రేమిస్తున్నాను. నిజం చెప్పాలంటే.. ఆయనంటే పిచ్చి, నా అభిమాన క్రికెటర్'అంటూ ఓపెన్ అయ్యింది.
ఇంతకీ ఇషితా రాజ్ ఎవరు?
ఆల్ రౌండర్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై మనసు పారేసుకున్న ఇషిత రాజ్. హార్థిక్ కంటే నాలుగేండ్లు పెద్దది. పాండ్యాకు 30 ఏళ్లు కాగా, ఇషితకు 34 ఏళ్లు. ఢిల్లీ వాసి అయిన ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాను అభ్యసించింది. ఆ తరువాత ఢిల్లీలోని గర్గీ కాలేజ్‌లో బీకామ్ పూర్తి చేసింది. ఆ తరువాత లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ బ్యూటీ.
2011లో ప్యార్‌కా పంచ్ నామా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సోనుకి టిటు కి స్వీటీ సినిమాతో తెగ పాపులరిటీ సంపాదించుకుంది. అలాగే ప్రస్థానం, యారం, జై మమ్మీ ది సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసే ఇషితా రాజ్ ప్రేక్షకులకు ఫ్రీ గ్లామర్ షో అందిస్తుంది.


Click it and Unblock the Notifications











