హాట్ టాపిక్ గా మారుతున్న జాన్వీ కపూర్ కొత్త బంగ్లా.. రేటెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న వారి కంటే ఫామ్ లో లేనివారి హవానే ఎక్కువగా నడుస్తోంది. అందులో జాన్వీ కపూర్ కూడా ఉన్నారు. అమ్మడు మొదటి సక్సెస్ ఇంతవరకు చూడలేదు. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నటనలో కూడా ఇంకా అనుకున్నంత రేంజ్ లో ఆకట్టుకోలేకపోతోంది. అయితే సినిమాల రిజల్ట్ పక్కనపెడితే అమ్మడు ఒక విలువైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Actress Janhvi Kapoor Maid Tested Corona Positive
బాధ పడకుండా అడుగులు వేస్తోంది..

బాధ పడకుండా అడుగులు వేస్తోంది..

జాన్వీ కపూర్ మొదట దడఖ్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. కానీ విడుదల తరువాత ఆడియెన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. పైగా జాన్వీ కపూర్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అసలు ఆమె కొన్ని సీన్స్ లలో అనుకున్నట్లుగా నటించలేదని టాక్ గట్టిగానే వచ్చింది. అయినా కూడా ఆమె బాధకు గురి కాకుండా అడుగులు వేస్తోంది.

ఆ సినిమాతో పాజిటివ్ కామెంట్స్

ఆ సినిమాతో పాజిటివ్ కామెంట్స్

అయితే ఆ విమర్శలకు ఒక విధంగా జాన్వీ గుంజన్ సక్సేనా సినిమాతో కౌంటర్ ఇచ్చింది. సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. సినిమా మేకింగ్ పై విమర్శలు వచ్చినప్పటికీ జాన్వీ నటనపై మాత్రం మంచి రివ్యూలు వచ్చాయి. ఇక ఆ సినిమా లాక్ డౌన్ లో ఉండగా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే జాన్వీ మంచి ఆఫర్స్ అంసుకుంటోంది.

ఖరీదైన బంగ్లా..

ఖరీదైన బంగ్లా..

అసలు మ్యాటర్ లోకి వెళితే జాన్వీ కపూర్ కు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఈ 23ఏళ్ల నటి ముంబైలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ఇంట్లోకి తండ్రీ, చెల్లితో కలిసి అడుగు పెట్టాలని జాన్వీ ప్లాన్ చేసుకుంటోందట. ఇప్పుడున్న ఇల్లు కాస్త చిన్నదిగా ఉండడం వలన జాన్వీ ఈ నిర్ణయం తీసుకుందట.

దాని ఖరీదు ఎంతంటే..

దాని ఖరీదు ఎంతంటే..

ఇక ఆ బంగ్లా ఖరీదు విషయానికి వస్తే.. 39కోట్ల వరకు ఉంటుందట. పైగా మళ్ళీ ఇంట్లో కొన్ని డిజైన్స్ కోసం జాన్వీ రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. జాన్వీ తన సొంత డబ్బుతోనే ఆ బంగ్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాల నుంచి అలాగే యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బును కూడబెట్టుకొని అమ్మడు తండ్రి సపోర్ట్ తో బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X