‘ఆ మూడు రోజులు నిద్రలేదు.. లైట్ల కింద అదే తొలి అనుభవం ’
రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్‌లలో కూర్చోబెట్టడం అంత తేలిక కాదు. ఇందుకోసం నటీనటులు ఎంతో శ్రమిస్తారు. ఈ ప్రాసెస్‌లో తీవ్రంగా గాయపడిన వారు, ప్రాణాల మీదకి తెచ్చుకున్నవారు ఉన్నారు. చివరికి అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా ఒర్చుకుంటారు. రిస్కీ స్టంట్స్, స్టెప్స్, ప్రమాదకర పరిస్థితుల్లో షూటింగ్స్ వంటివి నటీనటుల రోజువారీ జీవితంలో రోటీన్‌గా మారిపోయాయి. కష్టమని తెలిసినా వృత్తి మీద ఉన్న గౌరవంతో సాహాసాలు చేయడానికీ వెనుకాడటం లేదు మన స్టార్స్. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన కెరీర్‌లో ఫేస్ చేసిన కఠినమైన పరిస్ధితులను పంచుకున్నారు.
అతిలోక సుందరి , బాలీవుడ్ నట దిగ్గజం దివంగత శ్రీదేవి , నిర్మాత బోనీ కపూర్ దంపతుల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా జాన్వీకి అవకాశాలు అంత తేలిగ్గా దక్కలేదు. ఇందుకోసం ఆమె ఎంతో కష్టపడ్డారు, అవమానాలు భరించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో ఓనమాలు దిద్దారు జాన్వీ కపూర్. తన కుమార్తెను హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం జాన్వీని అన్నిరకాలుగా తీర్చిదిద్దిన ఆమె తన కూతురిని తెరపై చూడకుండానే కన్నుమూశారు.

2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి కన్నుమూశారు. అప్పటికి జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోన్న డెబ్యూ మూవీ ధడక్ చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి కాలేదు. కరణ్ జోహార్ నిర్మాతగా శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 జూలై 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తనను స్టార్ హీరోయిన్‌గా చూడాలన్న తల్లి కోరికను నెరవేర్చడం కోసం ఎంతో కష్టపడ్డారు జాన్వీకపూర్. ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సెనా : ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉల్జా వంటి చిత్రాలతో లక్ష్యాన్ని అందుకున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర ద్వారా టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం హిందీలో సన్నీ సంస్కారికీ తులసి కుమారి, పరం సుందరి చిత్రాలతో పాటు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RC 16లోనూ జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీటి తర్వాత ఎన్టీఆర్ దేవర 2 కోసం కూడా ఆమె వెయిట్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, వ్యక్తిగత వివరాలను అభిమానులో పంచుకుంటూ ఉంటారు . తాజాగా రూహి సినిమా వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జాన్వీ ఆ సినిమా విశేషాలను పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. తాను తన కెరీర్‌లోనే తొలిసారిగా రూహి సినిమా కోసం సోలోగా డ్యాన్స్ చేశానని.. అప్పటికీ చాలా చిన్నదానిని కావడంతో పాటు కాంతివంతమైన లైట్ల కింద పనిచేశానని జాన్వీ చెప్పారు.
ఇలాంటి వాతావరణంలో కళ్లు తెరిచి ఎలా డ్యాన్స్ చేయాలో కూడా నేర్చుకోలేదని.. అప్పటికీ రూహితో పాటు గుడ్ లక్ జెర్రీ సినిమా షూటింగ్‌లోనూ ఒకేసారి పాల్గొన్నాని ఆమె తెలిపారు. ఓ రోజు రాత్రంతా పాటియాలాలో జీఎల్‌జే షూటింగ్‌లో పాల్గొని , విమానంలో ముంబైకి చేరుకుని, తిరిగి రాత్రి 7 గంటల పాటు నిద్ర లేకుండా రూహి సాంగ్‌ని కంప్లీట్ చేశానని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. ఈ పాట కోసం 3 రోజుల పాటు రిహార్సల్ కూడా చేసినట్లు జాన్వీ తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..వృత్తిపై ఆమ అంకిత భావాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











