50 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్ .. బ్లాక్ అండ్ వైట్‌లో స్టార్ హీరోయిన్ కవ్వింపులు
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. కానీ ఇండస్ట్రీపై, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన నటీనటులు కొందరే ఉంటారు. ఇలాంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తరాలు మారినా వారి పేరు ప్రఖ్యాతులు జనంలో అలాగే ఉంటాయి. ఇటువంటి వారిలో ఒకరు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్. 90వ దశకంలో భారతీయ సినీ రంగాన్ని ఏలిన ఈమె కుర్రాళ్ల కలల రాణిగా వెలుగొందారు.
1974 ఆగస్ట్ 5న మహారాష్ట్రలో జన్మించిన కాజోల్ అనతికాలంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అందం , అభినయంతో ఆమె ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి వారినైనా మెస్మరైజ్ చేసే ఆమె నవ్వుకు ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. కెరీర్ పరంగా ఆమె తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ కారణంగా కాజోల్‌కు అవకాశాలు ఇచ్చేందుకు స్టార్స్ వెనుకాడేవారు. కానీ విమర్శలను, అవమానాలను దిగమింగి అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నించారు.

1992లో బేఖుది మూవీతో పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చే సమయానికి ఆమె వయసు 17 ఏళ్లే . ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా బాజీగర్‌తో ఆమె తొలి హిట్ అందుకున్నారు. ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగేతో కాజోల్ భారతీయ చిత్ర పరిశ్రమలో బలంగా జెండా పాతారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించి తిరుగులేని హీరోయిన్‌గా నిలిచారు.
గూండారాజ్ సినిమా షూటింగ్ సమయంలో అజయ్ దేవగణ్‌తో పరిచయం, ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సినిమాలతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న కాజోల్.. అజయ్ దేవగణ్ ప్రొడక్షన్ హౌస్‌లో భాగస్వామి కూడా. గతేడాది దో పత్తి అనే సినిమాలో కాజోల్ ద్విపాత్రాభినయం చేశారు. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నిర్మించారు. షహీరా షేక్, తన్వీ అజ్మీ, బ్రిజేంద్ర లా తదితరులు కీలకపాత్రలు పోషించారు.

తన వయసు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలు వస్తే చేయడానికి తానెప్పుడూ ముందుంటానని కాజోల్ పలుమార్లు స్పష్టం చేశారు. 50 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. కఠినమైన డైట్, వ్యాయామంతో పాటు అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు కాజోల్. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కాజోల్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో తన తేనేకళ్లతో మెస్మరైజింగ్ లుక్‌లో కవ్విస్తున్నారు కాజోల్. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ డ్రీమ్ గర్ల్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











