భర్త అజయ్ దేవగన్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన కాజోల్!

బాలీవుడ్ నటుడు అజయ దేవగన్ సోషల్ మీడియాలో చేసిన చిన్న పొరపాటు.... చివరకు తన భార్య కాజోల్ చేత చివాట్లు తినేవరకు వెళ్లింది. అంతేకాదు ట్విట్టర్ సాక్షిగా అజయ్ దేవగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నీ వేషాలేమైనా ఉంటే... ఇంటి బయట వరకు ఒకే, ఒక వేళ ఇంట్లోకి నీ పైత్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పింది.

ఇంతకీ అజయ్ దేవగన్ చేసిన పొరపాటు ఏమిటంటే.... అతడు అనుకోకుండా తన భార్య కాజోల్ ఫోన్ నెంబర్ ట్విట్టర్లో షేర్ చేశారు. 'కాజోల్ ఇపుడు ఇండియాలో లేదు. ఆమెనతో మాట్లాడాలనుకుంటే వాట్సాప్ ద్వారా సంప్రదిచండి అంటూ ఆమె ఫోన్ నెంబర్ షేర్ చేశాడు.

Bollywood actress Kajol warns Ajay Devgn

ఈ పొరపాటును కాస్త ఆలస్యంగా గమనించిన అజయ్ దేవగన్... దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సినిమా సెట్స్‌లో ఫ్రాంక్స్ చేయడం పాత పద్దతి, ఇలా సోషల్ మీడియాలో మిమ్మల్ని సరదాగా ఆటపట్టించడానికే ఇలా చేశాను అని అజయ్ దేవగన్ మరో ట్వీట్ చేశారు.

అజయ్ చేసిన ఈ ట్వీట్‌పై కాజోల్ రియాక్ట్ అవుతూ.... 'ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాంక్స్‌ స్టూడియోను దాటి వెళ్లాయ్‌. కానీ ఇలాంటి వేషాలు ఇంట్లో కుదరవు' అని ట్వీట్‌ చేస్తూ కోపంగా ఉన్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇలా చేయడం ద్వారా అజయ్ దేవగన్‌కు పబ్లిగ్గా వార్నింగ్ ఇచ్చింది కాజోల్.

అజయ్ దేవగన్‌కు ముందు నుండి ఫ్రాంక్‌స్టర్ అనే పేరుంది. ఆయన సెట్స్‌లో ఉంటే ఏదో ఒక పని చేస్తూ తోటి నటీనటులు ఆటపట్టిస్తుంటారు. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. తన నెంబర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వందల్లో సందేశాలు వస్తుండటంతో కాజోల్ ఆగ్రహానికి గురైనట్లు స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X