పాయల్ ఘోష్‌కి మద్దతు పలికిన కంగనా రనౌత్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

కొన్నేళ్ల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో నటి పాయల్ ఘోష్ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ వివాదం రోజురోజుకి మరింత ముదురుతోంది. అనురాగ్ కశ్యప్ పై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) లో ఫిర్యాదు చేయాలని పాయల్ ఘోష్ నిర్ణయం తీసుకోవడంతో నేషనల్ మీడియాలో ఈ కాంట్రవర్సీ మరింత వైరల్ గా మారింది. ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ రేఖ శర్మ కూడా ఈ వివాదంపై స్పందించారు.

వైరల్ గా మారిన పాయల్ ఆరోపణలు

వైరల్ గా మారిన పాయల్ ఆరోపణలు

అనురాగ్ కశ్యప్ గత ఐదేళ్ల క్రితం ఒక సినిమాకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనపై అసభ్యంగా ప్రవర్తించినట్లు పాయల్ తెలుగు న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ వరకు వెళ్లింది. అదే విధంగా కంగనా రనౌత్ కూడా పాయల్ కి మద్దతు పలికింది.

మద్దతు పలికిన కంగనా రనౌత్

మద్దతు పలికిన కంగనా రనౌత్

ప్రతి ఒక్కరి వాయిస్ మ్యాటర్ కూడా ముఖ్యమైనది అంటూ కంగనా రనౌత్ చాలా సింపుల్ గా పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం కంగనా బాలీవుడ్ పై వరుస వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పాయల్ ఘోష్ కి కూడా మద్దతు పలకడం హాట్ టాపిక్ గా మారింది.

రంగంలోకి ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్

రంగంలోకి ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్

ప్రముఖ దర్శకుడు నటుడు చేసిన దుశ్చర్యలకు చర్యలు తీసుకోవాలని కోరినందున ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ రేఖ శర్మ కూడా మద్దతు ఇస్తానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

పాయల్ ఘోష్ ట్వీట్‌పై స్పందిస్తూ రేఖ శర్మ ఎన్‌సిడబ్ల్యుకు ఫిర్యాదు చేసే ప్రక్రియ యొక్క లింక్‌ను కూడా షేర్ చేసుకున్నారు, ఈ విషయాన్ని సంస్థ పరిశీలిస్తుందని తెలిపారు.

Recommended Video

Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
అవన్నీ అబద్ధాలే: అనురాగ్ కశ్యప్

అవన్నీ అబద్ధాలే: అనురాగ్ కశ్యప్

మరోవైపు అనురాగ్ కశ్యప్ ఈ ఆరోపణలను ఖండిస్తున్నాడు. ఆమె ఆరోపణలు 'నిరాధారమైనవి అంటూ అవన్నీ అబద్ధాలేనని కామెంట్ చేశారు. కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన అనురాగ్ ఈ విషయంలోకి కావాలని బచ్చన్ ఫ్యామిలీని అలాగే ఇతర నటీమణులను లాగడం' పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన జీవితంలో రెండు వివాహాలు చేసుకున్నా అలాగే ఇతర మహిళలతో క్లోజ్ గా ఉన్నా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదని కూడా అనురాగ్ వివరణ ఇచ్చారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X