Kareena Kapoor: ఒంటరిగా కనిపించడంతో కరీనాను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్.. భయపడిన నటి!
సినీ తారలు కొంతమంది ఫ్యాన్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండేది ఇష్టపడతారు. అయితే మరి కొన్నిసార్లు వారు పర్సనల్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఫ్యాన్స్ వచ్చి ఇబ్బంది పెడితే చాలా చిరాకు పడతారు. ఇక ఇటీవల కరీనాకపూర్ పెద్దగా సెక్యూరిటీ లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడిపోయారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కానీ కరీనాకపూర్ మాత్రం అప్పుడు వారితో ఫోటోలు దిగడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకు సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది.
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కరీనాకపూర్ ఎక్కడికి వెళ్లినా కూడా చాలా ప్రైవసీగా ఉండేందుకు ఇష్టపడుతుంది. ఆమె ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఎయిర్ పోర్ట్ లో కూడా ఆమె వెళ్తున్నట్లు వస్తున్న సమాచారం కెమెరా మెన్స్ కు తెలిసినప్పటికీ కూడా ఆమె వారి కంటపడకుండానే అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది.

అయితే ఈ క్రమంలో కరీనాకపూర్ అనుకోకుండా ఒక ఎయిర్ పోర్ట్ లో మాత్రం జనాల కంట పడింది. దీంతో ఆమెతో ఫోటోలు దిగేందుకు ఒక్కసారిగా అక్కడి వారు ఎగబడ్డారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా కరీనాకపూర్ భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె వెంటనే భయపడి పక్కకు జరిగిపోయింది. ఇక ఆ తర్వాత పక్కనే ఉన్న మరి కొంతమంది మహిళలు కూడా ఆమె మీదకు ఎగబడి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నం చేశారు.
అయితే కరీనాకపూర్ పెద్దగా వారిని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేసింది.
మొదట సైలెంట్ గా కారు దిగిన కరీనా ఎయిర్ పోర్ట్ లోపటికి వెళ్లే క్రమంలో ఆమెను ఫ్యాన్స్ ఒక్కసారిగా చుట్టేశారు. కొద్దిసేపటి వరకు సెక్యూరిటీ కూడా లేకపోవడంతో ఆమె చాలా ఇబ్బంది పడిపోయారు. కొంత సేపటి తర్వాత కొంతమందికి సెల్ఫీలు ఇచ్చిన కరీనాకపూర్ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక కరీనాకపూర్ చివరగా అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.


Click it and Unblock the Notifications











