40 వేల కోట్లు వదులుకున్న బాలీవుడ్ నటి.. కరిష్మా కపూర్ మాజీ భర్త ఎలాంటి బిజినెస్ చేసేవారంటే?

బాలీవుడ్ సీనియర్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ కన్నుమూశారు. జూన్ 12న ఇంగ్లాండ్ లో పోలో ఆడుతుండా హార్ట్ ఎటాక్ తో మరణించారు. 53 ఏళ్లలో ఆయన తుదిశ్వాస విడవటంతో ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ తో గతంలోనే విడాకులు తీసుకుంటుంది. ఆయన మరణంతో దేశంలో బిజినెస్ మ్యాగ్నెట్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. పలువురు వ్యాపార వేత్తలు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన తుది శ్వాస విడవటంతో సంజయ్ కపూర్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఇంతకీ సంజయ్ కపూర్ ఎవరు?
సంజయ్ కపూర్ దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త. సోనా కామ్‌స్టార్ కంపెనీ చైర్మన్. ఆటోమోటీవ్ విడిభాగాల తయారీలో ఈ సంస్థ దేశంలో టాప్ లో నిలిచింది. ఆటో మోటీవ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసిసయేషన్ అధ్యక్షుడిగానూ సంజయ్ కుమార్ వ్యాపార రంగ అభివృద్ధికి కృషి చేశారు. అలాగే సంజయ్ కు క్రీడలపైనా ఆసక్తి ఎక్కువానే ఉంది. పోలో ఆటోలపై ఆసక్తి చూపించే వారు. ఆరియస్ అనే కంపెనీతో పోలో జట్టు ను కూడా సంజయ్ కపూర్ సొంతం చేసుకున్నారు. వ్యాపార రంగంలో టాప్ లో నిలిచారు.

Bollywood Actress Karishma Kapoor Ex Husband Sunjay Kapur Net Worth

కరిష్మాతో సంజయ్ కపూర్ పెళ్లి, విడాకులు..
బాలీవుడ్ సీనియర్ నటి కరీష్మా కపూర్ తో సంజయ్ కపూర్ కు 2003లోనే వివాహం జరిగింది. గతంలో సంజయ్ కపూర్ కు నందితా మహాంతితో పెళ్లి జరిగింది. ఆమెతో విడిపోయిన తర్వాత కరీష్మా కపూర్ తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లి కుటుంబ సమక్షంలో గ్రాండ్ గానే జరగడం విశేషం. సంజయ్ కరిష్మా కపూర్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి పేర్లు సమీరా మరియు కియాన్. అయితే 2016లో వీరిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక సంజయ్ కరీష్మాతో విడిపోయిన తర్వాత మాజీ మోడల్ ప్రియా సచ్ దేవ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ఆజారియాస్ అనే అబ్బాయికి జన్మనిచ్చారు.

సంజయ్ కపూర్ ఆస్తుల విలువ..
వ్యాపారవేత్త సంజయ్ కపూర్ చనిపోయే వరకు 1.2 బిలియన్ డాలర్లు అంటే రూ. 10,300 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే ఆయన 2703వ సంపన్నుడిగా రికార్డులోకి ఎక్కారు. కొన్ని నెలల కింద ఆయన కంపెనీ వాల్యూ రూ.40,000 వేల కోట్లుగా ఫోర్బ్స్ వెల్లడించిన జాబితాలో వెల్లడైంది. ప్రపంచంలోనే టాప్ 10 కార్ కంపెనీలకు సంజయ్ కపూర్ ఆటోమోబైల్స్ విడిభాగాలను తయారు చేసి ఇస్తుంటారు. అలాగే ఎలక్రికల్ వెహికిల్స్ పోరాటంలోనూ ఆయన నకీలక పాత్ర పోషించారు.

కరిష్మా కపూర్ పిల్లలతో ఇలా..
సంజయ్ కపూర్ కు కరిష్మా కపూర్ తో విడాకులు అయినా కూడా వారిద్దరికి పుట్టిని సమీరా, కియాన్ ల బాధ్యతలను ఆయనే చూసుకుంటున్నారంట. అలాగే ప్రియా సచ్ దేవ్ తో పెళ్లి అయినా కూడా.. తన కుటుంబం మొత్తం ఒకే చోటా కలిసి ఉండాలని ప్రయత్నించారంట. కానీ అది వీలు పడలేదు. ఇక ఏదేమైనా కరిష్మా కపూర్ 40 వేల కోట్ల కు అధిపతి అయిన సంజయ్ కపూర్ నుంచి విడిపోయిందా? అంటూ నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X