‘డిప్రెషన్ లోకి వెళ్లా.. వాళ్ల వేధింపులు తట్టుకోలేకపోతున్న’
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషి ముఖర్జీ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమెకు ఇటీవల వాళ్ల నుంచి ఎక్కువగా వేధింపులు అవుతున్నాయని తాజాగా వెల్లడించింది. కొన్నాళ్లుగా ఆమెపై విపరీతంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై షాకింగ్ గా స్పందించింది. తెలుగు చిత్రాల్లోనూ ఈ ముద్దుగుమ్మకు అవకాశం దక్కడం విశేషం. ఖుషి ముఖర్జీ టాలీవుడ్ స్టార్ నితిన్ - శ్రద్ధా కలిసి నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోని సినిమాలు, ముఖ్యంగా టీవీ షోల్లో ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తోంది. అలాంటిది ఆమె తాజాగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్టు పోస్ట్ షాకింగ్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఖుషి ముఖర్జీ ఎవరు?
ఖుషి ముఖర్జీ సినిమాలు, టీవీ షోల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తూ ఉంటుంది. నార్త్ నటీనటులను అభిమానించే వారికి ఈ యంగ్ బ్యూటీ ఈజీగా తెలిసి ఉంటుంది. వెస్ట్ బెంగాల్ లోని కోల్ కత్తాకు చెందిన ఖుషి ముఖర్జీ 1996 నంబర్ 24న జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 28 ఏళ్లు కావడం విశేషం. ఈమె చిన్న వయస్సులోనే మోడల్ గా కెరీయర్ ను ప్రారంభించింది. అలా కాస్తా గుర్తింపు దక్కించుకున్న తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ వచ్చింది. వచ్చిన అవకాశాలను అందుకుంటూ కెరీర్ లో ఎదిగే ప్రయత్నం చేస్తోంది.

ఖుషి ముఖర్జీపై ట్రోలింగ్..
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషి ముఖర్జీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. మోడలింగ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆమె నటిగా అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత డిజిటల్ క్రియేటర్ గా ప్రయాణం మొదలు పెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఖుషి ముఖర్జీ తన డ్రెస్సింగ్ విషయంలో తీవ్రమైన ట్రోలింగ్ కు గురైంది. కారులో వెళ్తున్న సమయంలో ఒక దగ్గర దిగుతుంది. అప్పడు ఆమె ఒంటిపై ఒక టాప్ తప్ప మరేమీ ఉండదు. హాఫ్ డ్రెస్ లో కనిపించడంతో పలువురు ఫొటోలు వీడియోలు తీసి నెట్టింట పెట్టారు. దీంతో అది బాగా వైరల్ అయ్యింది.
ఖుషి ముఖర్జీ స్ట్రాంగ్ రిప్లై..
దాంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. కావాలనే ఖుషి ముఖర్జీ అలాంటి డ్రెస్ లో దర్శనమిచ్చిందని అంటున్నారు. ఖుషి ముఖర్జీ దుస్తులపై కాస్తా దారుణంగానే ట్రోలింగ్ మొదలు పెట్టారు. డ్రెస్సింగ్ విషయంలో ఈమె ఉర్ఫీ జావెద్ నే మించి పోయిందని ట్రోల్ జరిగింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఖుషి ముఖర్జీ దుస్తులపై గట్టిగానే ట్రోల్ జరిగింది. దీంతో ఆమె తాజాగా స్పందించింది. ఒక నోట్ ను కూడా విడుదల చేసి షాక్ ఇచ్చింది. ట్రోలర్స్ వల్ల, కొందరు నెటిజన్ల వల్ల తనకు డిప్రెషన్ వచ్చిందని చెప్పుకొచ్చింది.
నేను ఎలాంటి దుస్తులు వేసుకున్నా అది ఇతరులకు సంబంధం లేదని, నేను ధరించిన స్లీవ్ ను సగానికి కట్ చేసి ధరించినా అది నాకు సౌకర్యంగా అనిపిస్తే అలానే చేస్తాను. ఇక నేను నాకు నచ్చినట్టుగా ఉండాలని అనుకుంటున్నాను. మరోవైపు ఉర్ఫీ జావెద్ ను ఏమాత్రం కాపీ కొట్టే ప్రయత్నం చేయలేదని తెలిపింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్ వల్ల నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











