మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి అరెస్ట్.. జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు ఊరట!

బాలీవుడ్ నటి లీనా మారియా పాల్‌ను ఢిల్లీకి చెందిన ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) అధికారులు అరెస్ట్ చేశారు. మానీలాండరింగ్, ప్రముఖులను బెదిరించి అక్రమంగా డబ్బు లాగేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలతో తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖరన్‌కు ఈమె సతీమణి. గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో సుకేష్ చంద్రశేఖరన్‌కు సంబంధించిన లీలలు బయటకు వచ్చాయి. వ్యాపారవేత్తలను బెదిరించి వందల కోట్ల రూపాయలను కూడబెట్టుకొన్నారనే విషయం వెలుగు చూసింది. తాజాగా లానా మారియా పాల్‌ అరెస్ట్‌తో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు కొంత ఊరట లభించింది.

సుకేశ్ చంద్రశేఖర్ లీలలు ఎన్నో బయటకు వచ్చాయి. సంపన్న కుటుంబాలను బెదిరించడానికి ఏకంగా ప్రధాని కార్యాలయం, సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే సీనియర్ అధికారుల మొబైల్ నంబర్లు, ల్యాండ్ లైన్ నంబర్లను ఉపయోగించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు జడ్జీ పీఏ అని అందర్ని బెదిరించారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఇచ్చారనే ప్రధాన ఆరోపణలు వచ్చిన విషయం తాజా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

ఈడీ అధికారులు పలువురిని విచారించిన సమయంలో సుకేష్ చంద్రశేఖరన్ ఎక్ట్రార్షన్ రాకెట్‌లో లీనా మారియా పాల్ ప్రత్యక్ష సంబంధాలు బయటకు వచ్చాయి. పలువురు పారిశ్రామికవేత్తలను, వారి కుటుంబాలను దారుణంగా మోసగించారనే విషయం తెలియడంతో లీనా మారియా పాల్‌ను అరెస్ట్ చేశారు.

Bollywood actress Leena Maria Paul arrested by the Enforcement Directorate

రోహిణి జైలులో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారినని చెప్పి ఫేక్ ఫోన్ కాల్‌తో చెన్నైకి చెందిన ఓ వ్యాపార వేత్తకు 200 కోట్ల మేర టోపి వేశారు. ఈ రాకెట్‌లో భాగమైన పలువురు జైలు, బ్యాంక్ అధికారులును ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అని ఈడీ అధికారులు తెలిపారు.

మనీ లాండరింగ్ కేసులో రంగంలోకి దిగిన సుకేష్ చంద్రశేఖర్ అనే హవాలా దందాను నిర్వహించే వ్యక్తి అనుమానాస్పద వ్యవహారాలపై దృష్టిపెట్టారు. ఆ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులో జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ను ఐదు గంటలకుపైగానే విచారించడం హిందీ సినీ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి.

సుకేష్ చంద్రన్ ఇంటిపై ఈడీ అధికారులు మెరుపుదాడులు చేయగా. చెన్నైలోని ఆయన ఇంటిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, బెంట్లీ బెంటాయ్‌గా, ఫెరారీ 438 ఇటాలియా, లాంబోర్గిని ఉరుస్, ఎస్కాలేడ్, మెర్సిడెజ్ ఏఎంజీ 63, బీఎండబ్ల్యూ రేంజ్ రోవర్, మెర్సిడెజ్ లాంటి కార్లను తన ఇంటిలో ఈడీ అధికారులు గుర్తించారు. వేల సంఖ్యలో ఖరీదైన చెప్పులను గుర్తించారు. ఈ దాడుల్లో 80 లక్షలకుపైగా నగదు, డజన్‌కుపైగా కార్లను సీజ్ చేశారు.

Bollywood actress Leena Maria Paul arrested by the Enforcement Directorate

ఇక లీనా మారియా పాల్ కెరీర్ విషయానికి వస్తే. జాన్ అబ్రహం రూపొందించిన మద్రాస్ కేఫ్ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు.

సుకేష్ చంద్రన్ కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్ పేరు వినిపించడంతో ఆమెను ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే జాక్వలైన్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న ఓ వ్యాపారవేత్తను కూడా సుకేష్ మోసగించడంతో ఆ మేరకు ఆమెను ప్రశ్నించారు. అయితే ఈడీ విచారణ అనంతరం జాక్వలైన్‌ను ముద్దాయిగా కాకుండా సాక్ష్యురాలిగా ప్రశ్నించాం అని తెలిపారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X