Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్‌కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ప్రముఖ నటికి క్యాన్సర్.. షాకింగ్‌లో బాలీవుడ్.. సోనియాగాంధీ స్వయంగా వెళ్లి పరామర్శ!
బాలీవుడ్లో సీనియర్ నటి నఫీసా అలీ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమెకు క్యాన్సర్ స్టేజ్ 3 ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. లైఫ్ ఇన్ ఏ మెట్రో, బేవఫా, యమ్లా పగ్లా, దీవానా చిత్రాల్లో నటించిన నఫీసా అలీ ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకొన్నారు. నఫీసా క్యాన్సర్ వ్యాధికి గురయ్యారనే విషయం తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
హీరోయిన్గా నఫీసా అలీ కెరీర్
1979లో నఫీసా అలీ శశికపూర్ సరసన జునూన్ అనే చిత్రంలో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2005లో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. ప్రముఖ గోల్ఫర్ కల్నల్ సోధిని నఫీసా పెళ్లాడారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు.
రాజకీయాల్లో కూడా
సినీ రంగంతోనే కాకుండా రాజకీయ రంగంతోనూ నఫీసాకు పరిచయం ఉంది. 2009లో సమాజ్ వాదీ టికెట్‌పై పోటీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
సోనియా గాంధీ పరామర్శ
నఫీసా అలీ క్యాన్సర్ వ్యాధికి గురయ్యారనే విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. సోనియా గాంధీ కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
నా క్లోజ్ ఫ్రెండ్‌ను
సోనియా గాంధీ పరామర్శించిన విషయాన్ని నఫీసా అలీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాకు అత్యంత సన్నిహితమైన స్నేహితురాలిని కలిశాను. స్టేజ్ 3లో ఉన్న క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం కుదుటపడాలని సోనియా ఆక్షాంక్షించారు అని నఫీసా తెలిపారు.
సొనాలి, ఇర్ఫాన్ ఖాన్‌కు క్యాన్సర్
ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులు క్యాన్సర్ వ్యాధికి లోనైన వారు ఎక్కువ మందే ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బింద్రే క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. సొనాలి అమెరికాలో చికిత్స పొందుతుండగా, ఇర్ఫాన్ ఖాన్ లండన్ చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం కుదుట పడినట్టు వార్తలు వస్తున్నాయి.