twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నటికి క్యాన్సర్.. షాకింగ్‌లో బాలీవుడ్.. సోనియాగాంధీ స్వయంగా వెళ్లి పరామర్శ!

    |

    బాలీవుడ్‌లో సీనియర్ నటి నఫీసా అలీ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమెకు క్యాన్సర్ స్టేజ్ 3 ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. లైఫ్ ఇన్ ఏ మెట్రో, బేవఫా, యమ్లా పగ్లా, దీవానా చిత్రాల్లో నటించిన నఫీసా అలీ ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకొన్నారు. నఫీసా క్యాన్సర్ వ్యాధికి గురయ్యారనే విషయం తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

    హీరోయిన్‌గా నఫీసా అలీ కెరీర్

    హీరోయిన్‌గా నఫీసా అలీ కెరీర్

    1979లో నఫీసా అలీ శశికపూర్ సరసన జునూన్ అనే చిత్రంలో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2005లో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా‌కు చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. ప్రముఖ గోల్ఫర్ కల్నల్ సోధిని నఫీసా పెళ్లాడారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు.

    రాజకీయాల్లో కూడా

    రాజకీయాల్లో కూడా

    సినీ రంగంతోనే కాకుండా రాజకీయ రంగంతోనూ నఫీసాకు పరిచయం ఉంది. 2009లో సమాజ్ వాదీ టికెట్‌పై పోటీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.

     సోనియా గాంధీ పరామర్శ

    సోనియా గాంధీ పరామర్శ

    నఫీసా అలీ క్యాన్సర్ వ్యాధికి గురయ్యారనే విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. సోనియా గాంధీ కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

    నా క్లోజ్ ఫ్రెండ్‌ను

    నా క్లోజ్ ఫ్రెండ్‌ను

    సోనియా గాంధీ పరామర్శించిన విషయాన్ని నఫీసా అలీ తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నాకు అత్యంత సన్నిహితమైన స్నేహితురాలిని కలిశాను. స్టేజ్ 3లో ఉన్న క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం కుదుటపడాలని సోనియా ఆక్షాంక్షించారు అని నఫీసా తెలిపారు.

    సొనాలి, ఇర్ఫాన్‌ ఖాన్‌కు క్యాన్సర్

    సొనాలి, ఇర్ఫాన్‌ ఖాన్‌కు క్యాన్సర్

    ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులు క్యాన్సర్ వ్యాధికి లోనైన వారు ఎక్కువ మందే ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బింద్రే క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. సొనాలి అమెరికాలో చికిత్స పొందుతుండగా, ఇర్ఫాన్ ఖాన్ లండన్ చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం కుదుట పడినట్టు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Veteran actress Nafisa Ali who is known for her roles in films like 'Junoon', 'Life In A Metro...', 'Bewafaa', 'Yamla Pagla Deewana' has been diagnosed with Stage 3 cancer. The actress took to her Instagram page to share this news with a picture of her with Congress leader Sonia Gandhi and captioned it as, "Just met my precious friend who wished me luck & to get well from my just diagnosed stage 3 cancer."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X