నిర్మాతలు అలా వాడేశారు.. ‘టెంపర్’ బ్యూటీ నోరా ఫతేహి ఆవేదన!
బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లతో దుమ్ము లేపుతున్న ఏకైక హీరోయిన్ నోరా ఫతేహి. స్పెషల్ నెంబర్స్ తో ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. స్టార్ హీరోలకు జోడిగా స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేస్తూ అదరగొడుతోంది. అటు నార్త్ లో, ఇటు సౌత్ లో వచ్చిన అవకాశాలను నోరాఫతేహి అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటోంది. తన డ్యాన్స్ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటుంది. ఆమె డాన్స్ కు కూడా బాలీవుడ్ టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'టెంపర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యంగ్ హీరోయిన్ నోరా ఫతేహి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో నోరాఫతేహి స్పెషల్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో నోరా ఫతేహికి ఇదే మొదటి చిత్రం. ఈ బ్లాక్ బస్టర్ ఫిలిమ్ లో నోరా ఫతేహి ' ఇట్టాగే రెచ్చిపోదాం' ఐటెం సాంగ్ తో దుమ్ము లేపింది. ఎన్టీఆర్ కు ధీటుగా మాస్ స్టెప్స్ వేసి థియేటర్లలో క్రేజీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

స్పెషల్ డాన్సుల్లో నటించడానికి కంటే ముందే నోరా ఫతేహి రెండు హిందీ చిత్రాల్లో నటించింది. రోర్, క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అయితే ఆ సినిమాలు నోరా ఫతేహికి పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. దాంతో ఈ ముద్దుగుమ్మ దక్షిణాదిన అడుగు పెట్టింది. అలా టెంపర్, బాహుబలి, ఊపిరి, కిక్ 2, లోఫర్ లాంటి చిత్రాల్లో స్పెషల్ డ్యాన్స్ తో అదరగొట్టింది. చివరిగా మట్కా చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. అటు సినిమాలో మెరుస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ నోరా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.
ఇక పలు ఇంటర్వ్యూలోను తన గురించిన వ్యక్తిగత విషయాలను నిర్మొహమాటంగా తన అభిమానుల కోసం పంచుకుంటూ ఉంది. ఇక రీసెంట్ గా మాత్రం తనకు ఇండస్ట్రీలో జరిగిన మోసం గురించి చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు బాలీవుడ్ మీడియా, ప్రధాన మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. పలువురు నిర్మాతలు తనతో స్పెషల్ డాన్సులు చేయించుకొని సరైన పారితోషికం ఇవ్వలేదని ఆరోపించినట్టు తెలుస్తోంది. ఆ వివరాల ప్రకారం... ఎన్నో సినిమాల్లో నోరా ఫతేహి నటించిన స్పెషల్ సాంగ్స్ సినిమా రెవెన్యూ కు దోహదం చేశాయని చెప్పింది. కొందరు నిర్మాతలు అయితే తన స్పెషల్ సాంగ్ హిట్ అయిన ఏమాత్రం మర్యాద చూపించలేదని ఆవేదన చెందింది. సరైన పారితోషికం ఇవ్వలేదని, కొన్ని సందర్భాల్లో ఫ్రీగా కూడా చేశానని చెప్పినట్టు తెలుస్తోంది.
సినిమాల్లో మరిన్ని అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చానని చెప్పింది. మొదట్లో డబ్బులు ఇచ్చిన ఇవ్వకున్నా లెక్క చేయకుండా స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చానని చెప్పింది. కొంతకాలం పారితోషికం సరిగా లేకుండానే నటిస్తూ వచ్చానని చెప్పింది. ఇకపై మాత్రం తను కూడా రెవెన్యూ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నానని తెలిపింది. ఇక ప్రస్తుతం తన పేరు వాడుకుంటూ కొందరు తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని మండిపడింది. వారి సినిమాల కోసం తన పేరును చెడుగా వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నోరా ఫతేహి మాటలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











