రాజ్యసభకు మహేష్ హీరోయిన్ .. పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్
భారతదేశంలో సినిమాలు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉందన్న సంగతి తెలిసిందే. నటీనటులు ఏదో ఒక పార్టీకి మద్ధతుదారులుగా ఉన్నవారే. అయితే కొందరు బయటపెడితే, మరికొందరు మాత్రం సైలెంట్‌గా తమ రాజకీయాలు సాగిస్తారు. ఇక నటీనటులు ముఖ్యమంత్రులుగా మారి రాష్ట్రాలనే పాలించిన చరిత్ర మనది. ఇప్పటికే టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎంతో మంది సినీతారలు వివిధ రాజకీయ పార్టీల్లో చేరడమో లేదంటే సొంతంగా పార్టీ పెట్టో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో హిట్ కొట్టినవారు కొందరే. తమ అవసరాల దృష్ట్యా కొందరు స్టార్స్ వెంట రాజకీయ పార్టీలు పరుగులు తీస్తుంటాయి.
రాజకీయ పార్టీలు కొందరు తారలను రాజ్యసభ సహా ఇతర నామినేట్ పోస్టుల కింద నటీనటులకు పదవులు కట్టబెడుతుంటాయి. నాటి నెహ్రూ నుంచి నేటి మోడీ వరకు ఎన్నో ప్రభుత్వాలు నటీనటులను రాజ్యసభకు పంపాయి. ప్రస్తుతం రాజ్యసభలో సినీ పరిశ్రమకు చెందినప ఎందరో ఎంపీలుగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని డీఎంకే పార్టీ నుంచి దిగ్గజ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లే విషయమై వార్తలు వచ్చాయి.

తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, బాలీవుడ్ సినీయర్ నటి ప్రీతి జింటా కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన దిల్ సేతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి తన క్యూట్ లుక్స్, సొట్టబుగ్గలు, అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేశారు. సోల్జర్, సంఘర్ష్, క్యా కెహ్నా, మిషన్ కాశ్మీర్, ఫర్జ్, దిల్ చాహ్తా హై, దిల్ హై తుమ్‌హారా, ఆర్మన్, కోయి మిల్ గయా, కల్ హో నా హో, లక్ష్య , హీరోస్ తదితర చిత్రాల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు చిత్రంలోనూ నటించి ఇక్కడి వారిని ఆకట్టుకున్నారు.
రెండున్నర దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో ఉంటున్న ప్రీతి జింటా 2016లో అమెరికాకు చెందిన జీనీ గుడ్‌ఎనాఫ్‌ను పెళ్లాడారు. నటి నుంచి సినిమాలకు దూరమైన ప్రీతి .. ఒకటి అరా తప్పించి పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అయితే కాంట్రవర్సీలకు కూడా ప్రీతి జింటా కేరాఫ్‌గా నిలిచారు. వ్యాపారవేత్త నెస్‌వాడియాతో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ అతనితో రేపో మాపో పెళ్లి అనగా ఆకస్మాత్తుగా బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఇక పలుమార్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ప్రీతి జింటా.
తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ప్రీతి జింటాను రాజకీయ రంగం ప్రవేశంపై వారు ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. గతంలో పలు పార్టీల నుంచి తనకు రాజ్యసభ ఆఫర్ వచ్చిందని, అలాగే టికెట్ ఇస్తామని కూడా కొన్ని పార్టీలు ముందుకొచ్చాయని ప్రీతి జింటా తెలిపారు. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. తాము చేసే ప్రతి కామెంట్‌ను రాజకీయాలకు ముడిపెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ - పాక్ విభజన బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న లాహోర్ 1947లో ప్రీతి జింటా నటిస్తున్నారు. ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











