Priyanka Chopra భర్తకు గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం.. పెద్ద గండం నుంచే తప్పించుకున్నాడు!
వరల్డ్ వైడ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రియాంక చోప్రా తనకంటే చిన్నవాడైన నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రెగ్యులర్ గా సంతోషకరణమైన వార్తలతో నిలిచే ఈ జంట మొదటిసారి ఒక ఆందోళనకరమైన వార్తతో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రియాంక చోప్రా భర్త హఠాత్తుగా ఒక ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. పరిస్థితి బాగానే ఉన్నా కూడా అతనికి పెద్ద ప్రమాదమే తప్పినట్లు సమాచారం.
Recommended Video
మిస్ యూనివర్స్‌గా మిస్ మెక్సికో ఆండ్రియా.. సత్తా చాటిన భారతీయ అందాల సుందరి

ఎన్నో కష్టాలను ఎదుర్కొని..
ఎంతో కష్టపడి హాలీవుడ్ రెడ్ కార్పెట్ వరకు వెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను చూసింది. మోడలింగ్ డేస్ లో ఆమె చాలా విమర్శలు అవమానాలు కూడా చూసింది. ఎలాగైనా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడి అనుకున్న విజయాన్ని సాధించింది.

ఇష్టమైన చిన్నవాడితో ప్రేమ పెళ్లి
ఇక ఆమె హాలీవుడ్ యంగ్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వయసులో అతడు ఆమె కంటే 10 ఏళ్లు చిన్నవాడు అయినప్పటికీ ఈ జంట పర్ఫెక్ట్ కపుల్స్ గా క్రేజ్ అందుకుంటున్నారు. సోషల్ మీడియాలో రొమాంటిక్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఎదో ఒక విధంగా వైరల్ అవుతూనే ఉంటారు.

గాయపడిన ప్రియాంక చోప్రా భర్త
అయితే ఇటీవల నిక్ జోనస్ ఒక ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. గాయాలు కావడంతో అతన్ని హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్లారని సమాచారం. అయితే గాయాలు మరి పెద్దవి కాకపోవడంతో నిక్ జోనస్ తొందరగానే సెట్టయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పెద్దగా ప్రమాదేమి లేదని అంటున్నారు.

ఏం జరిగిందంటే..
లాస్ ఏంజెల్స్ లో శనివారం ఒక రియాలిటీ షో కోసమని వెళ్లిన నిక్ జోనస్ స్టేజ్ వద్ద కిందపడి గాయపడ్డారని సమాచారం. ఇంకా ఈ విషయం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక తలకు గాయలయ్యే ప్రమాదం నుంచి కూడా నిక్ కొద్దిపాటి సేకనులో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెంటనే సమీపాన ఉన్న అంబులెన్స్ లోనే హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చికిత్స అందించగా నిక్ వెంటనే కొలుకున్నాడట. ఇక సోమవారం మళ్ళీ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నట్లు సమాచారం.

ఇండియా కోసం విరాళాలు
ప్రమాదం పెద్దది కాకపోవడంతో ఎవరు కూడా సోషల్ మీడియాలో స్పందించలేదు. ఇక ఇటీవల నిక్ జోనస్ , తన భార్య ప్రియాంక చోప్రాతో కలిసి ఇండియా కోసం విరాళాలు సేకరించి పనిని మొదలు పెట్టారు. కోవిడ్ సెకండ్ వేవ్ తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం మనసును కలచి వేసిందని అందుకే వీలైనంత వరకు ప్రతి ఒక్కరు బాధితులకు సహాయం చేయడానికి సిద్ధమవ్వాలని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











