బ్రేకింగ్: రియా చక్రవర్తి అరెస్ట్.. సుశాంత్‌ కేసులో ఎదురుదెబ్బ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో రియా చక్రవర్తి మెడకు డ్రగ్స్ ఉచ్చు దాదాపు బిగుసుకొన్నట్టు కనిపిస్తున్నది. బాలీవుడ్ మీడియా అందిస్తున్న కథనాల ప్రకారం రియాను మంగళవారం మధ్యాహ్నం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. గత మూడు రోజులుగా ఆమెను విచారిస్తున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. చివరకు మంగళవారం మధ్యాహ్నం ఆమెను అరెస్ట్ చేసినట్టు అధికారులు ధృవీకరించారు. డ్రగ్ కేసులో రియాను అరెస్ట్ చేయడంతో బాలీవుడ్‌‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Rhea Chakraborty: బ్రేకింగ్ న్యూస్.. సుశాంత్‌ కేసులో ఎదురుదెబ్బ, రియాను అరెస్ట్ చేసిన NCB | Oneindia
నిషేధిత డ్రగ్స్ ఉపయోగించినట్టు అంగీకరించిన రియా

నిషేధిత డ్రగ్స్ ఉపయోగించినట్టు అంగీకరించిన రియా

ఎన్సీబీ అధికార వర్గాల సమాచారం ప్రకారం.. తాను మారిజువానా లాంటి నిషేధిత డ్రగ్స్ ఉపయోగించినట్టు అధికారుల ముందు ఒప్పుకొన్నట్టు తెలిసింది. తన సోదరుడు షోవిక్ చక్రవర్తి ద్వారా డ్రగ్స్ సమకూర్చుకొనే దానిని అనే విషయాన్ని అంగీకరించినట్టు తెలుస్తున్నది. రెండు రోజుల క్రితం షోవిక్, సుశాంత్ మేనేజర్ శ్యామ్యూల్‌ను అరెస్ట్ చేయడంతో రియా అరెస్ట్ ఖాయమనే మాట వినిపించింది.

రియా నోట బాలీవుడ్ ప్రముఖుల పేర్లు

రియా నోట బాలీవుడ్ ప్రముఖుల పేర్లు

విచారణలో భాగంగా రియా చక్రవర్తి బాలీవుడ్‌కు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలను బయటపెట్టినట్టు సమాచారం. అధికారులు ప్రశ్నించిన సందర్భంగా ఆమె పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లను కూడా వెల్లడించినట్టు తెలుస్తున్నది. రియా చక్రవర్తి అందించిన సమాచారం ఆధారంగా మరికొందరు బాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించే అవకాశం ఉంది.

రియాను కస్టడీలోకి తీసుకొని వైద్య పరీక్షలు

రియాను కస్టడీలోకి తీసుకొని వైద్య పరీక్షలు

రియాను కస్టడీలోకి తీసుకొన్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం సాయంత్రం 4 గంటలకు మెడికల్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆమె వైద్య పరీక్షలు నిర్వహించి అరెస్ట్‌ను ధృవీకరించే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుంచి ఫోటోలు, బాలీవుడ్ బండారం

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుంచి ఫోటోలు, బాలీవుడ్ బండారం

రియా నుంచి స్వాధీనం చేసుకొన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు, ట్యాబులు ఇతర వస్తువుల నుంచి డ్రగ్స్ సంబంధాలను బయటకు తీసినట్టు సమాచారం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో డ్రగ్స్ మాఫియాతో బలమైన సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. బాలీవుడ్ పార్టీలలో పలువురు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలతో దిగిన ఫోటోలను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X