అలాంటి చెడు అలవాట్లు మాత్రమే ఉన్నాయి.. కానీ డ్రగ్స్ తీసుకోలేదు: రియా చక్రవర్తి
బాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకో మలుపు తిరుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ అంశం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది. మొన్నటివరకు నెపోటిజమ్ చుట్టూ నడిచింది. ఇక ఇప్పుడు కేసులో ఊహించని ట్విస్టుకు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం నార్కోటిక్ బ్యూరో జరిపిన విచారణలో రియా ఎవరు ఊహించని విషయాలను బయటపెట్టేసింది.

8గంటల పాటు విచారణ..
8గంటల పాటు జరిపిన విచారణలో రియా డ్రగ్స్ కి సంబంధించిన అనేక రకాల ప్రశ్నలను ఎదుర్కొంది. సోమవారం ఉదయం 9:30నిమిషాలకి ఇన్వెస్టిగేషన్ కోసం హాజరైన రియా సాయత్రం ఆరు గంటల వరకు కూడా NCB కార్యాలయం నుంచి తిరిగి వెళ్లారు. ఈ విచారణలో రియా బాలీవుడ్ స్టార్స్ పేర్లను కూడా బయటపెట్టినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ అలవాటు లేదు.
బాలీవుడ్ కి చెందిన దాదాపు 19మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని రియా అధికారులకి తెలిపినట్లు సమాచారం. అదే విధంగా రియా తనకు డ్రగ్స్ అలవాటు లేదని కేవలం సిగరెట్ తాగే అలవాటు మాత్రమే ఉందని విచారణలో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం సుశాంత్ కోసమే డ్రగ్స్ తీసుకువచ్చేదానిని అంటూ గత కొంత కాలంగా అతనికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు రియా చెప్పింది.

సుశాంత్ తో పాటు స్నేహితులు కూడా
ఇక సోదరుడు షోవీక్ ద్వారానే డ్రగ్స్ డీలర్ తో పరిచయాలు ఏర్పడ్డాయని అతను నివాసానికి కూడా వచ్చే వాడని రియా అధికారులకు తెలిపింది. ఇక రియాని అలాగే శామ్యూల్ మిరిండాతో కొంతసేపు విచారించగా పార్టీ చేసుకున్నప్పుడు సుశాంత్ తో పాటు అతని స్నేహితులు కూడా డ్రగ్స్ తీసుకునేవారని తెలిపింది.
Recommended Video

రియా సోదరుడిపై స్పెషల్ ఫోకస్
2016నుంచి సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు ఉందని శామ్యూల్ ద్వారా డ్రగ్స్ తెప్పించి సుశాంత్ కి ఇచ్చినట్లు రియా మరో కోణంలో అధికారులకు కొన్ని కొత్త విషయాలను చెప్పినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఎక్కువగా రియా సోదరుడైన షోవీక్ చక్రవర్తి పైనే NCB అధికారులు దృష్టి పెట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది అని విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలని అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











