పెళ్లికి సిద్ధమవుతున్న హాట్ హీరోయిన్.. నాలుగేళ్లుగా హీరోతో డేటింగ్.. చివరకు..

బాలీవుడ్‌లో మరో స్టార్ జంట ఒక్కటవ్వబోతున్నారు. గత కొద్దికాలంగా ప్రేమ వ్యవహారంలో మునిగితేలుతున్న ఈ జంట వివాహానికి సిద్ధమవుతున్నారు. చాలా రోజులుగా వీరి రిలేషన్‌పై వస్తున్న రూమర్లకు తెరదించేందుకు రెడీ అయ్యారు. బాలీవుడ్‌లో విభిన్నమైన తారలుగా పేరు తెచ్చుకొన్న రిచా చద్దా, అలీ ఫజల్ వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ పెళ్లి గురించి వివరాల్లోకి వెళితే..

కోర్టులో రిజిస్ట్రేషన్

కోర్టులో రిజిస్ట్రేషన్

త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న రిచా, అలీపై బాలీవుడ్ మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకొన్నారు. అధికారికంగా కోర్టులో పత్రాలను దాఖలు చేశారు అంటూ మీడియా కొంత సమాచారాన్ని లీక్ చేసింది. దాంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఫక్రే మూవీ షూటింగ్‌లో

ఫక్రే మూవీ షూటింగ్‌లో

రిచా చద్దా, అలీ ఫజల్ ఓ బాలీవుడ్ మూవీలో కలిసి నటించారు. ఫక్రే అనే సినిమాలో కలిసి నటించే సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత నుంచి అంటే గత నాలుగేళ్లుగా వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరి రిలేషన్‌పై పలు రకాల కథనాలు మీడియాలో వెలుగు చూశాయి. తాజాగా అలాంటి రూమర్లకు తెర దించుతూ షాకిచ్చారు.

ముంబై కోర్టులో రిజిస్ట్రేషన్

ముంబై కోర్టులో రిజిస్ట్రేషన్


నటి రిచా చద్దా తరఫు పీఆర్వో ఈ వార్తపై స్పందిస్తూ.. రిచా, అలీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ముంబైలోని కోర్టులో పెళ్లి కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. పత్రాలు సమర్పించిన తర్వాత మూడు నెలల గడువు ఉంటుంది. వీరి పెళ్లి ఏప్రిల్ చివరి వారంలో జరుగుతుంది. వేదిక, సమయం లాంటి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం అని అన్నారు.

రిచా చద్దా కెరీర్

రిచా చద్దా కెరీర్


బాలీవుడ్‌లో ఓయే లక్కీ.. లక్కీ ఓయే చిత్రంతో ప్రవేశించిన రిచా చద్దా.. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సిరీస్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఫక్రే, ఫక్నే రిటర్న్, క్యాబెరేట్,సరబ్ జిత్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రిచా నటించిన షకీల బయోపిక్, కంగన రనౌత్ నటించిన పంగా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X