Sara Ali Khan: సైకిల్ మీద బికినీ అందాలతో స్టార్ హీరో కూతురు.. నెవ్వర్ బిఫోర్ అనేలా గ్లామర్ షో

ఇటీవల కాలంలో స్టార్ హీరోల వారసులు వెండితెరపై డిఫరెంట్ గా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అమ్మాయిలు కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకుంటున్న నటీమణుల్లో సారా అలి ఖాన్ ఒకరు. ఇక ఆమె గ్లామర్ స్టిల్స్ తో కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. రీసెంట్ గా ఆమె సైకిల్ మీద బికినీ లుక్ లో కనిపించింది. ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరో కూతురిగా..

స్టార్ హీరో కూతురిగా..

బాలీవుడ్ లో హీరోగానే కాకుండా ఇటీవల విలన్ పాత్రలు కూడా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ సినిమాలో రావన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన మొదటి భార్య కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతొంది. మొదటి నుంచి ఆమె బ్యాక్ గ్రౌండ్ తో కాకుండా తన సొంతంగా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. మోడలింగ్ లో ఉన్నప్పుడే సారా పలు కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది.

మొదట ఆ సినిమాతో గుర్తింపు

మొదట ఆ సినిమాతో గుర్తింపు

ఇక మొదట సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హీరోగా నటించిన కేధర్నాథ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా మంచి గుర్తింపును అందుకుంది. ఇక ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా సారా అలీ ఖాన్ కు నటిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఆ సినిమా అనంతరం నటిగా ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది.

వరుసగా డిఫరెంట్ సినిమాలు

వరుసగా డిఫరెంట్ సినిమాలు

ఇక టెంపర్ రీమేక్ సింబా సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అందులో సారా హీరోయిన్ గా నటించింది. అనంతరం ఆమె లవ్ ఆజ్ కల్, కూలి నెంబర్ వన్ సినిమాలు చేసింది. ఆ సినిమాలు కుడా ఆమె కెరీర్ కు కొంత హెల్ప్ అయ్యాయి. కేవలం లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా మాస్ కమర్షియల్ సినిమాకు చేసేందుకు కూడా ఈ బ్యూటీ ఆసక్తిని చూపిస్తుంది.

బికినీ లుక్ వైరల్

ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలతోనే తన ఫ్యాన్స్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో సారా పోస్ట్ చేస్తున్న ఫొటోలు ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. రీసెంట్ అమ్మడు బికినీ లుక్ లో కనిపించింది. సైకిల్ మీద స్టైల్ గా కనిపిస్తూ బ్యూటీఫుల్ గా స్టిల్ ఇచ్చింది. ఇక ఆ ఫొటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సినిమాలతో బిజీగా..

సినిమాలతో బిజీగా..


ఇక సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో 41 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాధించుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అలాగే పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకోవాలి అని ప్రయత్నం చేస్తోంది. ఇక ప్రస్తుతం ఒక వెబ్ సీరీస్ చేసేందుకు కూడా ప్రముఖ ఓటీటీ సంస్థతో సారా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సారా చివరగా నటించిన ఆత్రంగి రే హాట్ స్టార్ లో విడుదలైన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X