స్టార్ హీరోయిన్ దివాళా.. పెళ్లి చేసుకొని ఇల్లు అమ్ముకొంటున్న స్టార్ హీరో కూతురు!
బాలీవుడ్ దిగ్గజ నటుడు శత్రఘ్న సిన్హా కుమార్తె, స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కొద్దిరోజుల క్రితం తన చిరకాల మిత్రుడు జహీర్ ఇక్బాల్‌లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ జోలికి వెళ్లకుండా.. ముంబైలోనే అతికొద్దిమంది అతిథుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. హ్యూమా ఖురేషి, సిద్ధార్, అదితీ రావ్ హైదరీ, అర్పితా ఖాన్, ఆయుష్ శర్మ తదితరులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పెళ్లయి నెలలు తిరక్కుండానే సోనాక్షి సిన్హా వైవాహిక జీవితంలోనూ, ఆర్ధికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా బీ టౌన్‌లో వార్తలు వస్తున్నాయి.
సోనాక్షి- ఇక్బాల్‌లు 2022లో డబుల్ ఎక్స్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా బీ టౌన్ మీడియా కోడై కూసింది. అయితే అంతకు ఐదేళ్ల ముందు నుంచే వీరిద్దరి ప్రేమ, డేటింగ్ మొదలైందట. అయితే సోనాక్షి హిందూ అమ్మాయి కాగా.. ఇక్బాల్ ముస్లిం. వీరిద్దరూ మతాంతర వివాహం చేసుకుంటారని వార్తలు వచ్చినప్పుడే కొందరు పెదవి విరిచారు కూడా. స్వయంగా సోనాక్షి తల్లి, సోదరుడు ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసినట్లుగా ప్రచారం జరిగింది. తల్లి కొడుకులిద్దరికి వీరి వివాహం ఇష్టం లేదని వార్తలు వచ్చాయి.

అయితే శత్రుఘ్న సిన్హా ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇది తన ఏకైక కుమార్తె వివాహామని, ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమని.. పెళ్లికి ఖచ్చితంగా హాజరవుతానని తేల్చిచెప్పారు. జహీర్‌ను పెళ్లిచేసుకున్న నేపథ్యంలో సోనాక్షి సిన్హా ఇస్లాం మతంలోకి మారుతారంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది. అయితే ఈ వార్తలను జహీర్ తండ్రి , సోనాక్షి మామగారు ఇక్బాల్ రతాన్సీ గతంలోనే ఖండించారు. సోనాక్షి మతం మారరని తాను మానవత్వాన్ని మాత్రమే నమ్ముతానని.. హిందువులు భగవాన్ అన్నా, ముస్లింలు అల్లా అన్నా చివరికి మనమంతా మనుషులమని రతాన్సీ వెల్లడించారు.
అయితే పెళ్లయి రెండు నెలలు కూడా కాకుండానే సోనాక్షి - జహీర్ జంట ఇబ్బందులను ఎదుర్కొంటోందనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. సోనాక్షి సిన్హాకు ముంబైలో హైప్రొఫైల్ వ్యక్తులు నివసించే బాంద్రాలో ఓ లగ్జరీ ఫ్లాట్ ఉంది , అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ ఫ్లాట్ దాదాపు 4,200 చదరపు అడుగుల విస్తర్ణంతో నిర్మించారు. ఇందులో 2 బెడ్‌రూమ్స్, జిమ్, ప్రైవేట్ లిఫ్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సోనాక్షి- జహీర్‌ల పెళ్లి కూడా ఈ ఫ్లాట్‌లోనే జరిగింది. ఇన్ని ప్రత్యేకతలు, ఎంతో ఖరీదైన ఈ ఇంటిని సోనాక్షి అమ్మకానికి పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఫ్లాట్ ధర రూ.25 కోట్ల పైమాటేనని టాక్.
అయితే ఉన్నపళంగా సోనాక్షి సిన్హాకు ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పని, పాటా లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని సోనాక్షి దివాళా తీసిందని.. చివరికి ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్ధితి వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో సోనాక్షి పని అయిపోయిందని అంటున్నారు. ఇదే సమయంలో ఆ ఫ్లాట్ సోనాక్షిది కాదని , మరొకరి ఇంటిని సోనాక్షిదిగా చెబుతున్నారని మండిపడుతున్నారు. మరి ఆ ఫ్లాట్ ఎవరిది, మీడియాలో వస్తున్నట్లుగా నిజంగానే సోనాక్షి తన ఇల్లు అమ్ముకుంటున్నారా , లేదా అన్నది తెలియాలంటే ఆమె స్వయంగా స్పందించాలి.


Click it and Unblock the Notifications











