సల్మాన్ ఖాన్ తో గొడవ.. సెట్స్ లో నాతో అలా చేసేవాడు.. సోనాలి బింద్రే కామెంట్స్

సౌత్ ఆడియెన్స్ లోనూ చెరగని ముద్ర వేసుకుంది సీనియర్ నటి, అందాల తార సోనాలి బింద్రే. ముంబై లో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు చిత్రాల్లో నటించి ఇక్కడి ఆడియెన్స్ కు కూడా ఎంతగానో దగ్గరైంది. 1994 నుంచి ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. హిందీ, తెలుగు భాషల్లో వరస పెట్టి సినిమాలు చేసింది. 90లలో, 2000 ప్రారంభంలో నార్త్, సౌత్ లో ఒక ఊపూపింది. ఇక ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. తన పెళ్లి తర్వాత దాదాపు 20 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ గురించి సోనాలి బింద్రే ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

సోనాలి బింద్రే గురించి..
సొనాలి బింద్రే మహారాష్ట్రలోని ముంబై నగరంలో పుట్టి పెరిగింది. జనవరి 1, 1975లో జన్మించింది. సోనాలి బింద్రే వాళ్ల నాన్న సివిల్ సర్వెంట్ కావడం విశేషం. దాంతో సోనాలికి మంచి విద్యను అందించారు. ఆమె స్కూలింగ్ మొత్తం బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయంలోనే పూర్తైంది. రామ్‌నారాయణ్ రుయియా కళాశాలలో తన డిగ్రీని పూర్తి చేసుకుంది. తన ఇద్దరు చెళ్లెల్లు ఉన్నారు. ఇక తర్వాత తనకు నటనపైన ఉన్న ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తొలుత మోడలింగ్ రంగంలో మంచి రిజల్ట్ ను అందుకుంది. లక్స్ సోప్ యాడ్ లో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా అవకాశాలను అందుకుంది.

Bollywood Actress Sonali Bendre Shocking Comments about Salman Khan

సోనాలి బింద్రే తెలుగు సినిమాలు..
చిన్న చిన్న పాత్రలో నటిస్తూ సోనాలి బింద్రే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. 1995లో బాలీవుడ్ లో ది డాన్, గద్దర్, టక్కర్ బాంబే వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రక్షక్, సపూట్, దిల్ జలే వంటి చిత్రాలతో హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. అలా బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమా అవకాశాలను అందుకుంది.

అదే సమయంలో సౌత్ నుంచి కూడా సోనాలి బింద్రేకు మంచి ఆఫర్లు దక్కాయి. ఇక తెలుగులో సోనాలి బింద్రే చాలా సినిమాలే చేసింది. తొలుత మహేశ్ బాబ సరసన 'మురారి'లో నటించింది. ఆ తర్వాత ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, ఫల్నాటి బ్రహ్మనాయుడు వంటి చిత్రాలతో అలరించారు. ఇక ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. సోనాలి 2002లో పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. మళ్లీ లాక్ డౌన్ తర్వాత నుంచి సినిమాలు చేస్తోంది. రీసెంట్ గానే బీ హ్యాపీ అనే చిత్రంలో క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చింది.

సల్మాన్ ఖాన్ పై సోనాలి బింద్రే కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై తాజాగా సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో సల్మాన్ ఖాన్ తో తను 'హమ్ సాథ్ సాథ్ హై' అనే చిత్రంలో నటించిందని చెప్పింది. అయితే ఆ చిత్ర షూటింగ్ లో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్లమని చెప్పింది. సెట్స్ లో సల్మాన్ ఖాన్ తనని ఆటపట్టించేవాడని చెప్పింది. ముఖ్యంగా క్లోజప్ షాట్స్ లో అల్లరి చేస్తూ సరిగా ఎమోషన్ ను పండించకుండా చేసేవాడని చెప్పుకొచ్చింది. అలాగే సల్మాన్ ఖాన్ సాఫ్ట్ పర్సన్ అని కూడా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X