twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లికి సిద్దమవుతున్న మరో బాలీవుడ్ జంట.. స్టార్ హీరో పెళ్లి కంటే ముందుగానే మూడుముళ్లు

    |

    బాలీవుడ్‌ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఒకరి తరువాత మరొకరు ఏ మాత్రం గ్యాప్ లేకుండా పెళ్లి చేసుకుంటూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇటీవల రాజ్‌కుమార్ రావు పత్రలేఖ (నవంబర్ 15న) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రేమ బంధంలో మునిగి తేలిన ఈ జంట మొత్తానికి పెళ్లితో సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక త్వరలోనే మరికొన్ని ప్రేమ జంటలు కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ తో పాటు మరో యువ జంట కూడా పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వారి పేర్లు వైరల్ అవుతున్నాయి.

    యామి గౌతమ్ సైలెంట్ మ్యారేజ్

    యామి గౌతమ్ సైలెంట్ మ్యారేజ్

    గత ఏడాది లాక్ డౌన్ కారణంగా కొంతమంది సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా మరికొందరు కూల్ గా కరోనా నిబంధనలను పాటించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామి గౌతమ్ కూడా తన ప్రియుడు ఆదిత్య ధర్ ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి అయితే చాలా సైలెంట్ గానే జరిగింది. ఇక కొందరు టెలివిజన్ సెలబ్రిటీలు సైతం చాలా కూల్ గా పెళ్లి చేసుకున్నారు.

     విక్కీ కౌషల్ - కత్రినా మ్యారేజ్

    విక్కీ కౌషల్ - కత్రినా మ్యారేజ్

    ఇక కత్రినా కైఫ్ విక్కీ కౌషల్ కూడా డిసెంబర్‌లో రాజస్థాన్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వస్తోంది. పోర్ట్ రిసార్ట్‌లో వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. విక్కీ కౌషల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే రాజస్థాన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అతి తక్కువమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరగబోతున్నట్లు టాక్. కత్రినా గత ఏడాది నుంచి వివాహం చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు అయితే కరోనా కారణంగా గతంలో ఆ వేడుకను వాయిదా వేసినట్లు టాక్. అయితే సైలెంట్ గానే నిశ్చితార్థం చేసుకున్నట్లు కథనాలు కూడా వెలువడుతున్నాయి.

    పెళ్లికి సిద్ధమైన మరో జంట

    పెళ్లికి సిద్ధమైన మరో జంట

    ఇక రణబీర్, అలియా భట్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి కోసం వీరు కూడా ఏడాదికి పైగా ఎదురుచూస్తున్నారు. ఇక వీరి పెళ్లి కంటే ముందు రణబీర్ కజిన్ ఆదార్ జైన్ యువ నటి తారా సుతారియాను వివాహం చేసుకోనున్నారని సమాచారం. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 నటి తారా సుతారియా చాలా కాలంగా ఆదార్ జైన్‌ తో ప్రేమలో ఉంది. ఇక ఇప్పుడు ఇటీవల ఈ జంట కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి విషయంలో చర్చలు జరిపారట.

    Recommended Video

    Masakali 2.0 Review | Why Bollywood Spoiling AR Rahman Songs? | Frustrated Fan Review
    సినిమాలతో బిజీబిజీగా..

    సినిమాలతో బిజీబిజీగా..

    ఇక కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. తారా సుతారియా తడప్ సినిమాతో మరో రెండు సినిమాలు చేస్తోంది. ఇక తడప్ విడుదల సిద్ధంగా ఉంది. RX100 రీమేక్ లో కూడా నటిస్తున్న ఈ బ్యూటీ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటోంది. ఇక ఆమె లిస్ట్ లో ఏక్ విలన్ రిటర్న్స్ మరియు హీరోపంతి 2 వంటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

    English summary
    Bollywood actress Tara Sutaria Getting Married Soon
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X