నడిరోడ్డుపై బాయ్‌ఫ్రెండ్‌తో .. రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన నేషనల్ క్రష్

చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఎవరో ఒకరు ప్రేమలో పడటమో , పెళ్లి పీటలెక్కడమో చేస్తూ అభిమానులకు శుభవార్తలు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న జంటలు ఇప్పటికీ తమ బంధాన్ని బయటపెట్టకుండా.. పబ్లిక్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఏదో ఒక జంట పెళ్లి వార్తలు చెబుతూ ఖుషీ చేస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రీ - సామ్ మర్చంట్ జోడీ కూడా ఒకటి.

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌లో జోయాగా కనిపించిన తృప్తి .. రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. నిజానికి ఏడెనిమిదేళ్ల కిందటే పోస్టర్ బాయ్స్‌తో ప్రారంభమైంది తృప్తి కెరీర్. కానీ జనానికి ఆమె గురించి తెలియడానికి యానిమల్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. యానిమల్ తర్వాత అభిమానులు ఆమెను నేషనల్ క్రష్‌గా పిలవడం మొదలుపెట్టారు. అలాగే తృప్తికి వరుసపెట్టి అవకాశాలు క్యూ కడుతున్నాయి. విక్కి విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలాయా 3, ధడక్‌లలో ఆమె నటిస్తున్నారు.

Bollywood actress triptii dimri caught at road with her boy friend sam merchant video goes viral

కానీ ఈ స్థాయికి రావడానికి తృప్తి ఎన్నో కష్టాలను అనుభవించారు. చిత్ర పరిశ్రమలోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు చాలా భయపడ్డారని.. కానీ తానే ధైర్యం చేసి ముంబైకి వచ్చానని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక్కడ ఒకే గదిలో దాదాపు 50 మందితో కలిసి నివసించానని గుర్తుచేసుకున్నారు. రాత్రింబవళ్లు అవకాశాల కోసం ప్రయత్నించానని.. ఎన్ని కష్టాలు పడినా తల్లిదండ్రుల వద్దకు తిగిరి వెళ్లకూడదని బాధలు భరించానని చెప్పింది. అండగా నిలవాల్సిన బంధువులు , ఇరుగుపొరుగు రాబందుల్లా తల్లిదండ్రులను మరింత భయపెట్టారని తృప్తి వెల్లడించారు. తనకు పెళ్లి కాదని, అలా ఉండిపోవాల్సిందేనని సూటిపోటీ మాటలతో హింసించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.

ఇక అందరు స్టార్ హీరోయిన్స్ మాదిరిగానే తృప్తిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. మోడల్ , వ్యాపారవేత్త సామ్ మర్చంట్‌తో తృప్తి డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. బీటౌన్‌ టాక్‌ను బట్టి ఈ జంట 2017 నుంచి సన్నిహితంగా ఉంటున్నారట. ఇటీవల సామ్ మర్చంట్‌కి బర్త్ డే విషెస్ చెప్పడంతో వీరి బంధానికి మరింత బలం చేకూరినట్లయ్యింది. తాజాగా సామ్‌తో బైక్‌పై చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది.

Bollywood actress triptii dimri caught at road with her boy friend sam merchant video goes viral

ఇందులో సామ్ మర్చంట్ హెల్మెట్ ధరించగా.. తృప్తి మాత్రం కేవలం మాస్క్ పెట్టుకుని ఫేస్ కవర్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ జంట త్వరలోనే తమ బంధాన్ని బయటపెట్టి పెళ్లి పీటలెక్కుతారనే వార్తలు వస్తున్నాయి. ఆ రోజు త్వరగా రావాలంటూ అభిమానులు కామెంట్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: triptii dimri sam merchant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X