మరో అగ్ర న‌టి సోష‌ల్ మీడియా అకౌంట్ హ్యాక్.. కేసు నమోదు

ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ సెలబ్రెటీలకు సంబంధించిన పలు సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి. గతంలో చాలా మంది సినీ తారలు హ్యాకింగ్ వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిలా మటోండ్కర్‌ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా హ్యాకింగ్ కు గురయ్యిందట. డిసెంబర్ 16 న హ్యాక్ చేయబడిందని ఊర్మిలా మటోండ్కర్‌ ముంబై సైబర్ సెల్‌కు లేఖ రాశారు.

ఇక ఫైనల్ గా ఆమె ఈ రోజు డిసెంబర్ 21న ముంబై సైబర్ సెల్ ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఊర్మిలా మటోండ్కర్‌ యొక్క హ్యాక్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిసెంబర్ 17న పునరుద్ధరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 43,66, 66 (సి) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ముంబై సైబర్ సెల్ కూడా ఊర్మిలా మటోండ్కర్‌ ప్రకటనను రికార్డ్ చేసింది.

No matter how careful, many social media accounts related to celebrities are being hacked. Many movie stars have had to deal with hacking in the past. Recently, the Instagram account of senior actress and politician Urmila Matondkar was also hacked. On December 16, Urmila Matondkar wrote a letter to the Mumbai Cyber Cell alleging that she had been hacked.

తన ఖాతా హ్యాక్ చేయబడిందని ఈ సీనియర్ నటి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ చేయబడింది. ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని స్టెప్స్ ద్వారా అకౌంట్స్ వెరిఫై చేస్తామని హ్యాక్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపిన ఆమె వెంటనే సైబర్ క్రైమ్ కు పిర్యాదు చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఊర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో అమితాబ్ బచ్చన్, పూజా హెగ్డే వంటి స్టార్స్ కూడా ఇదే తరహాలో హ్యాకింగ్ ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X