twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thank God సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు.. ఇబ్బందుల్లో పడిన అజయ్ దేవ్ గన్ సినిమా!

    |

    ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలపై వస్తున్న ఆరోపణలు వాటి బాక్సాఫీస్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే సినీ ప్రముఖులు చాలా జాగ్రత్తగా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఎలాంటి వివాదాలకు కూడా తావివ్వకుండా ముందుగు సాగుతున్నారు. అయితే అలాంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండే అజయ్ దేవగన్ ఈసారి తన సినిమా విషయంలో ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం నేషనల్ మీడియాలో థాంక్ గాడ్ సినిమాకు సంబంధించిన ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల లోకి వెళితే..

    బాలీవుడ్ పై వరుసగా ఆరోపణలు

    బాలీవుడ్ పై వరుసగా ఆరోపణలు

    అసలే బాలీవుడ్ సినిమాలకు ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అనుకున్నంత స్థాయిలో అయితే రావడం లేదు. ముఖ్యంగా రొటీన్ కమర్షియల్ సినిమాలకు ఆడియన్స్ చాలా వరకు దూరం పెడుతున్నారు. ఎంతో విభిన్నంగా ఉంటే గాని థియేటర్స్ వరకు రావడం లేదు. అంతే కాకుండా బాలీవుడ్ లో హిందూ మతాలను కించపరిచే విధంగా సినిమాలు ఎక్కువగా వచ్చాయనే ఆరోపణలు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

    థాంక్ గాడ్ సినిమాపై..

    థాంక్ గాడ్ సినిమాపై..

    అయితే అజయ్ దేవగన్ సినిమా పై ఇటీవల మరో ఆరోపణ రావడం హాట్ టాపిక్ గా మారింది. అజయ్ దేవగన్ చాలావరకు కాంట్రవర్సీలకు దూరంగానే తన సినిమాలను తెరపైకి తీసుకువస్తూ ఉంటాడు. అయితే ఇటీవల అతను నటించినా థాంక్ గాడ్ సినిమాకు సంబంధించిన సీన్స్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని కేసులు నమోదవడం చర్చనీయాంశంగా అవుతొంది. కర్ణాటకలో పలు హిందు సంఘాలు ఈ సినిమాను అడ్డుకుంటామని అంటున్నారు.

    ట్రైలర్ విడుదల తరువాత

    ట్రైలర్ విడుదల తరువాత


    అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన థ్యాంక్ గాడ్ చిత్రం మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. నటీనటులలపై దర్శకుడు ఇంద్ర కుమార్‌పై ఫిర్యాదు చేయడంతో విషయం సీరియస్ గా మారింది. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 9న విడుదలైంది. సినిమాలోని సీన్స్ హిందు దేవుళ్ళను అపహాస్యం చేస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఉన్నట్లు ఆరోపించారు.

    సినిమాను అడ్డుకుంటాము అని..

    సినిమాను అడ్డుకుంటాము అని..


    ట్రైలర్‌లో చూపించిన విధంగా ప్రతీ ఒక్కరి పాప పుణ్యాలను లెక్కించే భగవంతుడు చిత్రగుప్తుడిని అలాగే మరణానంతరం ఆత్మను తీసుకునే యముడు ఆధునిక దుస్తులు ధరించారు. అందుకే సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వరాదని, లేకుంటే మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నందున రాష్ట్ర, కేంద్ర హోంశాఖలు సినిమాను నిషేధించాలని హిందూ జన జాగృతి సమితి డిమాండ్ చేసింది. అలాగే వీధుల్లో బైఠాయించి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

    English summary
    Bollywood Ajay Devgn Thank God has landed into trouble again
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X