twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడి ఆత్మహత్య.. వ్యక్తిగత కారణాలే అని అనుమానం..? షాక్‌లో ఫ్యాన్స్

    |

    పైకి ఎంతో ఆడంబరంగా ఉండే కొందరి నటీనటులు జీవితాల్లో చీకటి కోణాలుంటాయి. పైకి వారు బాగానే కనబడుతున్నా.. లోలోపల మాత్రం ఎన్నో రకాలుగా కుంగిపోతుంటారు. నటీనటుల వ్యక్తిగత జీవితం, వారి భాగస్వామితో సమస్యలు, ఆర్ఠిక పరమైన విషయాలు ఇలా ఎన్నో సమస్యలు వారిని వెంటాడుతుంటాయి. సాధారణ వ్యక్తులకు ఇవన్నీ కామనే అయినా.. సెలెబ్రిటీల విషయంలో అందరూ శ్రద్ద చూపిస్తారు. సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో జరిగే విషయాలను అందరూ గమనిస్తుంటారు. అలా ఆడంబరంగా కనిపించే ఓ సీరియల్ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

     బుల్లితెరపై ఫేమస్..

    బుల్లితెరపై ఫేమస్..

    ఇష్క్‌ మే మర్‌జావా ధారవాహికతో ఎందర్నో ఆకట్టుకున్న కుశాల్‌ పంజాబీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయిలోని తన నివాసంలో కుశాల్.. శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుశాల్‌ మృతితో భావోద్వేగానికి గురైన ఆయన స్నేహితులు, అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

    భార్యతో విబేధాలు..

    భార్యతో విబేధాలు..

    కుశాల్ వ్యక్తిగత జీవితంలో వచ్చిన మనస్పర్థల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. కుశాల్ తన భార్యతో వేరు పడ్డాక అతనికి ఆరోగ్యం పాడైపోయిందని, ఈ కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ఇతని వద్ద సూసైడ్ నోట్ లభించిందని సమాచారం.

    ఆ వార్తను నమ్మలేకపోతున్నాను..

    ఆ వార్తను నమ్మలేకపోతున్నాను..

    కుశాల్ మరణంపై అతని స్నేహితుడు కర్ణవీర్‌ బోహ్రా ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘నువ్వు మృతిచెందావనే వార్త నన్ను నరకంలోకి తీసుకువెళ్లింది. ఇప్పటికీ నేను ఆ వార్తను నమ్మలేకపోతున్నాను. సంతోషమైన జీవితాన్ని గడుపుతున్న నువ్వు ఇలా ఎందుకు చేశావో అర్థం కావడం లేదు. జీవితాన్ని చూసే కోణంలో ప్రతిసారి నన్ను ఎంతగానో ఇంప్రెస్‌ చేశావు. ఒక డ్యాన్సింగ్‌డాడీగా ఎప్పటికీ నిన్ను గుర్తుపెట్టుకుంటాను' అని కర్ణవీర్‌ పేర్కొన్నారు.

    అభిమానుల ట్వీట్లు..

    అభిమానుల ట్వీట్లు..

    కర్ణవీర్‌ పెట్టిన పోస్ట్‌పై స్పందించిన పలువురు నటీనటులు, నెటిజన్లు.. కుశాల్‌ మృతి పట్ల షాక్‌కు గురయ్యారు. నటి శ్వేత తివారీ.. ‘వాట్‌.. ఓ మైగాడ్‌.. ఎప్పుడు.. ఎలా..?' అని కామెంట్‌ పెట్టగా.. ‘వాట్‌? ఇది ఎప్పుడు జరిగింది. ఇది నిజంగానే చాలా బాధకరమైన విషయం. నేను నమ్మలేకపోతున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరాల'ని వికాస్‌ కలాంత్రి అనే నటుడు తెలిపారు.

    English summary
    Bollywood and TV actor Kushal Punjabi hanged himself . Police sources said that they have recovered the suicide note and body has been taken for post mortem.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X