Nitin Chandrakant Desai: ఇండస్ట్రీలో విషాదం.. 'లగాన్' ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కాలం చేస్తున్నారు. ఒక మరణవార్తను మరిచిపోయేలోపే.. మరోకరు తనువు చాలించారనే వార్త వినాల్సి వస్తోంది. కొందరు అనారోగ్య సమస్యలు, వయో సంబంధిత కారణాలతో చనిపోతుంటే.. మరికొంతంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో సినీ పెద్దలు, ప్రముఖుల దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇలా తాజాగా ప్రతిభావంతుడైన, పాపులర్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
సినీ ఇండస్ట్రీలో తరచుగా జరుగుతున్న మరణాలతో సినీ లోకం దిగ్బ్రాంతికి లోనవుతోంది. తాజాగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ మరణించారు. కర్జాత్ లోని ఆయన సొంత ఎన్డీ స్టూడియోలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన బలవన్మరణానికి పాల్పడటానికి గల కారణలా ఇంకా తెలియాల్సి ఉంది. నితిన్ చంద్రకాంత్ దేశాయ్ మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

స్టార్ సెలబ్రిటీలు సైతం నితిన్ చంద్రకాంత్ దేశాయ్ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుబూతి తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా చంద్రకాంత్ దేశాయ్ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ గా 20 ఏళ్లపాటు సినీ ఇండస్ట్రీలో పనిచేశారు. నితిన్ దేశాయ్, అశుతోష్ గోవారికర్, విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ వంటి ప్రముఖ దర్శకులతో ఆయన పని చేశారు.
ఇక సొంతగా ND అనే స్టూడియో నిర్మించుకున్నారు ఈ ఆర్ట్ డైరెక్టర్. గత నెల ప్రారంభంలో గణేష్ చతుర్థి పండుగ కోసం తన స్టూడియోలో పూజ కూడా నిర్వహించారు నితిన్ చంద్రకాంత్ దేశాయ్. ముంబైలోని ప్రముఖ గణపతి మండల్ లాల్ బౌచ్య రాజా కోసం పండల్ డెకరేషన్ లో ఆయన పనిచేస్తున్నారు.

ఇక నితిన్ చంద్రకాంత్ దేశాయ్ సినిమాల విషయానికొస్తే 1942: ఏ లవ్ స్టోరీ, హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), లగాన్, దేవదాస్ (2002), వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై (2010) వంటి బాలీవుడ్ సినిమాలకు పని చేశారు. నితిన్ చంద్రకాంత్ దేశాయ్ చివరిగా అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేసిన పానిపట్ సినిమాకు వర్క్ చేశారు. అదే కాకుండా నితిన్ చంద్రకాంత్ దేశాయ్ 'మహారాణా ప్రతాప్' అనే కొత్త వెబ్ సిరీసుతో బిజీగా ఉన్నారు. అది నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











