ఆ హీరో పేరు చెబితే నా జీవితం నాశనమే.. రోజంతా కూర్చోబెట్టి.. అమైరా దస్తూర్ సంచలనం!

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం సృష్టిస్తున్న సంచలనాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొండి ధైర్యంతో తనుశ్రీ దత్త నానా పాటేకర్ లాంటి బడా సెలెబ్రిటీపై లైంగిన ఆరోపణలు చేసింది. ఆమె ధైర్యంతో స్ఫూర్తి పొందిన చాలా మంది నటీమణులు వారికి ఎదురైన లైంగిక వేధింపులని బయటపెడుతున్నారు. మీటూ ఉద్యమం బాలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలో కూడా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ ఓ సౌత్ ఇండియన్ హీరోపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

కలకలం రేపిన కామెంట్స్

కలకలం రేపిన కామెంట్స్

అమైరా దస్తూర్ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో ఈ భామ మనసుకు నచ్చింది, రాజు గాడు వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అమైరా దస్తూర్ నటించిన సౌత్ చిత్రాలకు సరైన గుర్తింపు లభించలేదు. మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తరుణంలో అమైరా దస్తూర్ చేసిన ఆరోపణలు కలకలం సృస్తిస్తున్నాయి.

స్టార్ హీరో అల్లుడు

స్టార్ హీరో అల్లుడు

తనని ఓ స్టార్ హీరో అల్లుడు లైంగికంగా వేధించాడని అమైరా దస్తూర్ ప్రకటించింది. అతడి పేరు బయటకు చెబితే నా జీవితం నాశనం అవుతుంది. అందుకే పేరు చెప్పడం లేదు. కానీ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బట్టబయలు చేస్తా అంటూ అమైరా దస్తూర్ వ్యాఖ్యానించింది.

అవకాశాలు రాకపోయినా

అవకాశాలు రాకపోయినా

తనకు సౌత్ లో అవకాశాలు రాకపోయినా పరవాలేదు. బాలీవుడ్ కంటే ఇక్కడే వేధింపులు ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హీరోని వదలిపెట్టేది లేదని అమైరా దస్తూర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అతడితో కలసి ఓ చిత్రంలో నటించాను. షూటింగ్ లో వేధించుకు చంపాడని అమైరా వాపోయింది.

చేయివేసి అసభ్యంగా

చేయివేసి అసభ్యంగా


షూటింగ్ లో అసభ్యంగా చేయి వేసి ఇబ్బంది పెడుతుండేవాడు. అతడికి ఉన్న పలుకుబడి దృష్ట్యా బయటకు చెప్పడానికి భయమేసింది. కానీ ఒకరోజు ధైర్యం చేసి దర్శకుడికి చెప్పానని అమైరా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది.

రోజంతా కూర్చోబెట్టి

రోజంతా కూర్చోబెట్టి


దర్శకుడికి ఫిర్యాదు చేసిన తరువాత నాకు నరకం మరింత ఎక్కువైంది. షూటింగ్ కోసం త్వరగా రావాలని పిలిచేవారు. కాస్ట్యూమ్స్ ధరించి సిద్ధంగా ఉంటే ఎంతకీ పిలిచేవారు కాదు. కొన్ని సందర్భాల్లో రోజంతా అలాగే కూర్చోబెట్టి కేవలం ఐదు నిముషాలు మాత్రమే షూటింగ్ చేసేవాళ్ళు. ఇలాంటి సంఘటనల వలనే తనకు దక్షణాది చిత్రాలంటే విరక్తి కలిగిందని అమైరా దస్తూర్ చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X