Urvashi Rautela: కొత్త డ్రెస్ వేసుకొని ప్రైస్ ట్యాగ్ తీయడం మర్చిపోయిన గ్లామరస్ బ్యూటీ

ఊర్వశి రౌతేలా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో డేరింగ్ గా కనిపించే గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. అయితే ఆమె చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుండి కూడా సినిమాల కంటే కూడా ఇతర అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడు బాహ్య ప్రపంచంలోకి వచ్చినా కూడా తన విభిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా వరకు ఊర్వశి వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె గ్లామర్ డోస్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల ప్రైస్ ట్యాగ్ తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఆమె రాగానే..

ఆమె రాగానే..

నిత్యం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బిజీగా కనిపించే ఊర్వశి అలాగే బడా సెలబ్రెటీల ఈవెంట్స్ లో కూడా ఎక్కువగా దర్శనమిస్తుంటుంది. శుక్రవారం ఊర్వశి జుహూలో సరికొత్తగా కనిపించింది. ఇక ఊర్వశి రౌతేలా ఈవెంట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన డ్రెస్సింగ్ స్టైల్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఊర్వశి గ్లామర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్ధమవుతుంది. ఆమె రాగానే కెమెరాలన్ని కూడా ఒక్కసారిగా ఆమె వైపుకు తిరిగాయి.

 కొత్త డ్రెస్ కు ప్రైస్ ట్యాగ్

కొత్త డ్రెస్ కు ప్రైస్ ట్యాగ్

అంతా బాగానే ఉంది గాని ఆమె అనుకోకుండా తన కొత్త డ్రెస్ కు ప్రైస్ ట్యాగ్ తీయడం మర్చిపోవడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఇది కూడా ఒక ఫ్యాషన్ అయ్యి ఉండవచ్చు అని ఓ వర్గం నెటిజన్లు ట్రోల్స్ కూడా మొదలుపెట్టేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఊర్వశి ఒక్క చిన్న ప్రైస్ ట్యాగ్ తో ఇంటర్నెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది.

 ధర ఎంతంటే..

ధర ఎంతంటే..

ఖరీదైన దుస్తులతో తరచుగా వార్తల్లో ఉండే ఊర్వశి ప్రైస్ ట్యాగ్‌ని తన వెనుక భాగంలో పోరాపాటున అలానే ఉంచేసినట్లు తెలుస్తోంది. అది వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈవెంట్ కోసం ఊర్వశి బెల్జియంకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ హౌస్ ఎలిసబెట్టా ఫ్రాంచీ డిజైన్ చేసిన ఫ్లోర్ లెంగ్త్ గౌను ఎంచుకుంది. ఈ డ్రెస్ ఆమె టోన్డ్ బాడీని మెచ్చుకోవడమే కాకుండా ఆమె వంపులను కూడా హైలైట్ చేసింది. అలాగే అనేక ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ దుస్తుల ధర రూ .67,697 అని కథనాలు వెలువడుతున్నాయి.

Recommended Video

Prabhas Supremacy.. ఈ ఆధిపత్యం అనితర సాధ్యం | Prabhas 25 | Spirit || Filmibeat Telugu
 సౌత్ పై కూడా ఫోకస్ పెట్టిన బ్యూటీ

సౌత్ పై కూడా ఫోకస్ పెట్టిన బ్యూటీ

ఇక ఊర్వశి రౌతేలా ప్రాజెక్టుల విషయానికి వస్తే.. గతంలో మాదిరిగా ఆమె కమర్షియల్ చిత్రాలను చేయకుండా కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. అవినాష్ రణదీప్ హుడా సరసన 'తిరుట్టు పాయలే 2' హిందీ రీమేక్‌తో పాటు ద్విభాషా థ్రిల్లర్ 'బ్లాక్ రోజ్' లో కూడా ఆమె నటిస్తోంది. ఇక త్వరలోనే ఆమె తమిళ ఇండస్ట్రీలో కూడా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఊర్వశి మాత్రం అస్సలు తొందరపడకుండా తనకు నచ్చినవి సెట్టయినవి మాత్రమే చేసుకుంటూ వెళుతుంది. ఇక త్వరలోనే ఆమె సౌత్ లో కూడా బిజీ అవ్వాలని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X