మరోసారి బాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్.. ఆ హీరోతో రాజ్ కుమార్ హిరాని బిగ్ మూవీ
బాలీవుడ్ లో కాన్సెప్ట్ బెసేడ్ సోషల్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీసే దర్శకులలో మొదటి స్థానంలో రాజ్ కుమార్ హిరాణీ ఉంటారు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు అన్ని కూడా ఏదో ఒక సోషల్ మెసేజ్ తోనే ఉంటాయి. అలాగే సమాజంలో ఉన్న అసమానతల నుంచి హిరాణీ కథలు పుడుతూ ఉంటాయి.
మున్నాభాయ్ ఎంబీబీఎస్ మూవీతో దర్శకుడిగా మారిన రాజ్ కుమార్ హిరాణీ తరువాత దానికి సీక్వెల్ చేశారు. ఇక ఆయన నుంచి వచ్చిన 3 ఇడియట్స్, పీకే సినిమాలు అమీర్ ఖాన్ తో చేశారు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఇలా ఈ దర్శకుడి వచ్చిన ప్రతి సినిమా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది.

చివరిగా సంజయ్ దత్ బయోపిక్ తో సంజు మూవీని రణబీర్ కపూర్ లీడ్ రోల్ లో చేశారు. ఈ సినిమా అంతగా ఆడలేదు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో డుంకీ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇది కూడా సోషల్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతోన్న సినిమా. దీని తర్వాత ఈ దర్శకుడు చేయబోయే సినిమాపై అప్పుడే క్లారిటీ వచ్చింది.
డుంకీ మూవీ రిలీజ్ తర్వాత రణబీర్ కపూర్ హీరోగా హిరాణీ నెక్స్ట్ సినిమా చేయబోతున్నారంట. అయితే పీకేకి సీక్వెల్ గా రణబీర్ కపూర్ తో ఉంటుందని గతంలో ప్రచారం నడిచింది. కంప్లీట్ గా కొత్త కథతో రణబీర్ కపూర్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కూడా సోషల్ ఎలిమెంట్స్ బేస్డ్ గానే రాజ్ కుమార్ హిరాణీ సిద్ధం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. డుంకీ ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత వచ్చే ఏడాది రాజ్ కుమార్ హిరానీ, రణబీర్ కపూర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళేఛాన్స్ ఉందని బిటౌన్ లో వినిపిస్తోన్న మాట.


Click it and Unblock the Notifications











