Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇద్దరు అమ్మాయిలతో.. సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. క్యాస్టింగ్ డైరెక్టర్ అరెస్ట్
బాలీవుడ్లో సెక్స్ రాకెట్ గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో క్యాస్టింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహా నగరంలో వ్యభిచార దందా జరుగుతుందనే సమాచారం అందుకొన్న సోషల్ సర్వీస్ బ్రాంచ్ ముంబైలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో క్యాస్టింగ్ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. వివరాల్లోకి వెళితే..
కస్టమర్ల నుంచి భారీగా
బాలీవుడ్లో నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్య అనే వ్యక్తి క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సినిమా అవకాశాలు ఎరవేసి అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నాడు. ఒక్కొ కస్టమర్ నుంచి రూ.60 వేల వసూలు చేసి దందాను నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా స్నేహితులు అజయ్ శర్మ, విజయ్ సహకారంతో ఐదేళ్లుగా సెక్స్ రాకెట్‌ను ఐదేళ్లుగా నడుపుతున్నారు అనే విషయాన్ని పోలీసులు తెలిపారు.
పక్కా ప్లాన్ ప్రకారం..
నవీన్ కుమార్ సాగించే దందాను బట్టబయలు చేయడానికి ఓ వ్యక్తిని పంపించాం. నవీన్ కుమార్ ఇద్దరు అమ్మాయిలను పంపిస్తానని, వారి వద్ద నుంచి రూ.60 వేలు డిమాండ్ చేశారు. అలాగే హోటల్లో రూమ్‌లో బుక్ చేయమని కస్టమర్‌ను అడిగాడు అని పొలీసులు వెల్లడించారు.
ముంబైలో సెవెన్ బంగ్లా
ముంబైలోని సెవెన్ బంగ్లా ప్రాంతంలో సెక్స్ రాకెట్ నడుస్తున్నదనే విషయాన్ని తెలుసుకొని దాడులు నిర్వహించాం. నవీన్ కుమార్ ఇద్దరు అమ్మాయిలతో రాగానే పక్కా ప్లాన్ ప్రకారం వారిని పట్టుకొన్నాం. వెంటనే నవీన్‌ను అరెస్ట్ చేశాం. ఇద్దరు అమ్మాయిల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం అని పేర్కొన్నారు.
ఇద్దరు అమ్మాయిలను కాపాడాం
ముంబైలోని విలాసవంతమైన హోటల్లో జరిగిన దాడిలో 18 ఏళ్లు, 25 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులను కాపాడాం. రాకెట్‌ను నిర్వహిస్తున్న క్యాస్టింగ్ డైరెక్టర్‌ను రిమాండ్‌కు తరలించాం. అందులో ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయిగా గుర్తించాం అని ముంబై పోలీసులు పేర్కొన్నారు.