జైట్లీ మృతితో శోకసంద్రంలో బాలీవుడ్.. 24 ఏళ్ల క్రితం అంటూ అనిల్ కపూర్ ఉద్వేగం

Recommended Video

Bollywood Celebrities Mourns On Arun Jaitley's Demise || Filmibeat Telugu

మాజీ ఆర్థిక మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అరుణ్ జైట్లీ ఇక లేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (ఆగస్టు 24న) దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. జైట్లీ మరణ వార్తతో సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ సేవలను గుర్తు చేసుకొంటూ బాలీవుడ్ ప్రముఖులు ఇలా స్పందించారు.

రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్

రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్

అరుణ్ జైట్లీ మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. ఆయన మృతికి నా ప్రగాఢ శ్రద్దాంజలి. జైట్లీ మృతితో విషాదానికి లోనైన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని సినీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు.

ఆశాభోంస్లే ట్వీట్

ఆశాభోంస్లే ట్వీట్

మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక లేరనే వార్తతో దిగ్బ్రాంతి చెందాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రముఖ గాయని ఆశాభోంస్లే సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతాపం వ్యక్తం చేశారు.

అనిల్ కపూర్ తీవ్ర దిగ్బ్రాంతి

అనిల్ కపూర్ తీవ్ర దిగ్బ్రాంతి

గౌరనీయులైన అరుణ్ జైట్లీని 20 ఏళ్ల క్రితం కలుసుకొన్నాను. అప్పటి నుంచి ఆయన విలువలను ఆరాధించడం మొదలుపెట్టాను. దేశానికి ఆయన ఎంతో సేవ చేశారు. అలాంటి వ్యక్తి ఇక లేరనే వార్తతో దిగ్బ్రాంతికి లోనయ్యాను. ఆయన లేకపోవడం తీరని లోటు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని అనిల్ కపూర్ ట్వీట్ చేశారు.

సన్నీ డియోల్ సంతాపం

సన్నీ డియోల్ సంతాపం

అరుణ్ జైట్లీ మృతిపై నటుడు, ఎంపీ సన్నీడియోల్ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పియింది. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని సన్నీడియోల్ ట్వీట్ చేశారు.

కరణ్ జోహర్ ట్వీట్

కరణ్ జోహర్ ట్వీట్

మాజీ అరుణ్ జైట్లీ మృతిపై ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన మృతితో దేశం మూగబోయింది. సమకాలీన రాజకీయాల్లో గొప్ప నేతగా రాణించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని కరణ్ జోహర్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X