సోనాలి బింద్రే ఎమోషనల్.. క్యాన్సర్‌ను ఎదురించి.. గణేషుడి సేవలో
ఆది దేవుడు వినాయకుడు పండుగను బాలీవుడ్ ప్రముఖులు భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకొన్నారు. సోషల్ మీడియాను ఆసరగా చేసుకొని తమ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సొనాలి బింద్రే, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, మలైకా ఆరోరా, సోనమ్ కపూర్ ట్వీట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రముఖులంతా ఏమని ట్వీట్ చేశారంటే..

అనిల్ కపూర్ ట్వీట్
గణేష్ చవితి సందర్భంగా అనిల్ కపూర్ ట్వీట్ చేస్తూ.. శ్రీ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమాప్రభ నిర్విఘ్నం అంటూ శుభాభినందనలు తెలిపారు. గణేషుడు దీవెనలతో ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలు, విజయాలతో ఉండాలని అనిల్ కపూర్ ఆకాంక్షించారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో సొనాలి బింద్రే
ఇటీవ క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన సొనాలి బింద్రే ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. నాకు అత్యంత ఇష్టమైన పండుగల్లో గణేష్ చతుర్థి ఒకటి. గతేడాది క్యాన్సర్ చికిత్స కారణంగా ఈ పండుగను జరుపుకోలేకపోయాను. ఈ సంవత్సరం ఆరోగ్యంగా, మానసికంగా బలంగా ఉండి నా ఫ్యామిలీతో కలిసి పండుగను జరుపుకోవడం మరింత ఆనందంగా ఉంది అంటూ సొనాలి తన పోస్టులో పేర్కొన్నారు.

అక్షయ్ కుమార్ ట్వీట్
గణేష్ చతుర్థి సందర్భంగా తన అభిమానులకు అక్షయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. మీ జీవితంలో ఎదురయ్యే అవరోధాలు, సమస్యలను గణేషుడు తొలిగించాలని, ప్రతీ ఒక్కరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఆకాక్షింస్తున్నాను అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.

సుఖ సంతోషాలతో
తన అభిమానులకు కార్తీక్ ఆర్యన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ. మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరు అన్ని రకాల సుఖాలతో ఉండాలని దేవుడిని కోరుకొంటున్నాను. హ్యాపీ గణేష్ చతుర్థి అని ట్వీట్ చేశారు.

సోనమ్ కపూర్ ట్వీట్
గణేష్ చతుర్థి సందర్భంగా అందాల తార సోనమ్ ట్వీట్ చేస్తూ.. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ పండుగను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తున్నది అని తెలిపారు. ప్రతీ ఒక్కరికి నా పండుగ శుభాకాంక్షలు అంటూ సోనమ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కృతిసనన్ ట్వీట్
ఇంకా ఇలా శుభాకాంక్షలు అందజేసిన వారిలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్, మనోజ్ బాజ్‌పేయ్, అజయ్ దేవగన్, సిద్దార్థ్ మల్హోత్రా, దియా మిర్జా, బిపాసా బసు, మధుర్ బండార్కర్, లారా దత్తా, మల్లికా శెరావత్ తదితరులు ఉన్నారు. తమ అభిమానులకు వారు శుభాకాంక్షలు అందజేసి సంతోషంగా ఉండాలని ఆకాక్షించారు.


Click it and Unblock the Notifications











