మాటలు రావడం లేదు.. ఇంకా జీర్జించుకోలేక పోతున్నా.... సుశాంత్ మృతిపై తారల స్పందన
బాలీవుడ్ యువ కెరటం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సినీ లోకం స్పందించింది. ఇంకెన్నీ ఘోరాలు చూడాలంటూ దు:ఖ సాగరంలో మునిగిపోతున్నారు. 2020 ఎందుకింత దయలేకుండా ఉందంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ ఇటీవలె మరణించగా.. కన్నడ యువ హీరో చిరంజీవి సర్జా రీసెంట్‌గా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రైజింగ్ స్టార్ సుశాంత్ మరణించారు. ఈ దుర్ఘటనపై సినీ తారలు స్పందిస్తున్నారు.

నిజం కాకూడదని..
సుశాంత్ మరణ వార్త తెలుసుకున్న సోనూ సూద్ షాక్‌కు గురయ్యాడు. హృదయం బద్దలైందని, మాటలు రావడం లేదని, ఈ వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నానని తెలిపాడు. నమ్మలేకపోతున్నాను.. షాక్‌కు గురయ్యాను.. మాటలే రావడం లేదని పూజా హెగ్డే కన్నీరు మున్నీరైంది.

మాటల్లో చెప్పలేను..
సుశాంత్ మరణ వార్తపై బాలీవుడ్ దాదా సంజయ్ దత్ స్పందిస్తూ.. మాటల్లో చెప్పలేను.. మరణ వార్త విని షాక్ అయ్యాను.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపాడు. కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. ఈ వార్త విన్నాక షాక్ అయ్యాను.. నన్నెంతో కలిచి వేసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరానలి కోరుకుంది.

మాటలు రావడం లేదు..
‘నిజాయితీగా చెబుతున్నా ఈ వార్త నన్ను షాక్ కు గురి చేసింది. మాటలు రానీయం లేదు. చిచ్చోరే సినిమాను చూస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, నీతో పాటు నటించాలని అనుకున్నాను.. ఎంతో ప్రతిభా వంతుడు.. ఆయన కుటుంబానికి ఆ దేవుడు బలం చేకూర్చాలి'అని అక్షయ్ తల్లడిల్లిపోయాడు.
Recommended Video

జీర్జించుకోలేకపోతున్నా..
సుశాంత్ మరణ వార్త ఇప్పుడే తెలిసిందని షాహిద్ కపూర్ స్పందిస్తూ.. ‘ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఆ భగవంతుడు వారికి బలాన్ని చేకూర్చాలి.. ఇప్పటికే ఆ చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్నా'ని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











