అంబానీ ఫ్యామిలీకి అత్యంత ఇష్టమైన సెలబ్రిటీలు ఎవరో తెలుసా? ఏ ఈవెంట్ జరిగినా వాళ్లు ఉండాల్సిందే

By Lekhaka

దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ. వీరితో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ ఆ అదృష్టం అందరికీ దక్కదు కదా. ముఖ్యంగా అంబానీ ఫ్యామిలీకి కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందరితోనూ కాకపోయినా కొంతమందితో మాత్రం ఈ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటుంది. అంబానీ ఫ్యామిలీలో ఏదైనా ఈవెంట్ జరిగింది అంటే ఈ బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేకంగా హాజరై తీరాల్సిందే. మరి అంబానీ కుటుంబానికి ఏ బాలీవుడ్ నటీనటులతో సన్నిహిత సంబంధం ఉందో ఇప్పుడు ఓ లుక్కేద్దాం పదండి.

అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ఈరోజు 2024 జూలై 12న వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే దాదాపు 6 నెలల నుంచి ఈ పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను కోట్లు కుమ్మరించి, పలువురు ప్రముఖులను ఆహ్వానించి ముఖేష్ అంబానీ పెద్ద ఎత్తున నిర్వహించారు.

Bollywood celebrities list who has special relation with ambani family Anant Ambani marriage sparks glamour Quotient

ఇక ఇప్పుడు పెళ్లిని ఇదివరకు భూమ్మీద ఎక్కడా జరగనంత గ్రాండ్ గా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనంత్ అంబానీ పెళ్లికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సౌత్ స్టార్స్ కూడా హాజరవుతున్నారు. ఈ వివాహా మహోత్సవానికి ఖాన్ ల త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మాత్రమే కాకుండా ఇతర నటీనటులు కూడా హాజరవుతున్నారు.

అయితే అందులో కొంతమందికి మాత్రమే అంబానీ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధం ఉంది. ముందుగా చెప్పుకోవాల్సింది కియారా అద్వానీ గురించి. ఈ బ్యూటీ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ క్లాస్మేట్. ఇద్దరూ ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. స్కూల్ టైం నుంచి కియారా, ఇషా స్నేహితులు. కియారా మాత్రమే కాదు ఇషా అంబానీ అలియా భట్ తో కూడా స్నేహంగా మెలుగుతుంది. ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో తల్లులయ్యారు కూడా.

Bollywood celebrities list who has special relation with ambani family Anant Ambani marriage sparks glamour Quotient

ఇక అంబానీ ఫ్యామిలీతో మంచి స్నేహబంధం ఉన్న టాప్ బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ లో యంగ్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా ఉంటుంది. అంబానీ ఇంట అడుగు పెట్టబోతున్న కొత్త కోడలు రాధిక మర్చంట్ కు జాన్వి మంచి స్నేహితురాలు. జామ్ నగర్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఈవెంట్ లోను జాన్వి కపూర్ కనిపించడమే కాదు ఫుల్ గా ఎంజాయ్ కూడా చేసింది. ఇక బాలీవుడ్ లో ఉన్న మరో బిగ్గెస్ట్ స్టార్ రణబీర్ కపూర్ కూడా అంబానీ కుటుంబానికి సన్నిహితుడే.

Bollywood celebrities list who has special relation with ambani family Anant Ambani marriage sparks glamour Quotient

ఆకాష్ అంబానీకి రణబీర్ స్నేహితుడు. ఆకాష్ తన భార్య శ్లోకా మెహతాతో కలిసి రణబీర్ అలియాల వివాహానికి కూడా హాజరయ్యారు. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ లోని సూపర్ స్టార్ బిగ్ బి గురించి. ఆయనకు అంబానీ కుటుంబంలో ఉన్న ఈతరం యూత్ కంటే అంబానీ తండ్రి బాగా క్లోజ్. ఓ ఈవెంట్లో బిగ్ బి ధీరూభాయ్ అంబానీ గురించి ఎమోషనల్ స్టోరీ కూడా చెప్పారు. అలా ఎప్పటినుంచో బిగ్ బికి అంబానీ ఫ్యామిలీతో మంచి స్నేహబంధం ఉంది. అందుకే అంబానీల ఇంట ఎలాంటి వేడుక జరిగినా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న సెలబ్రిటీలు అందరూ తప్పకుండా కనిపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X