twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయోధ్య తీర్పు.. బాలీవుడ్ సెలెబ్రిటీల స్పందన.. వైరలవుతోన్న ట్వీట్లు

    |

    దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య తీర్పు వెలువడింది. దశాబ్దాలపాటు నాన్చుతూ వచ్చిన ఈ సున్నితమైన అంశానికి సంబంధించిన కేసు ముగిసిపోయింది. వివాదాస్పదంగా మారిన రామజన్మ భూమి, బాబ్రీ మసీద్‌‌కు సంబంధించిన 2.77 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జిస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఆనందాన్ని, అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ తీర్పుపై ఎవరెవరు ఏవిధంగా స్పందించారో ఓసారి చూద్దాం.

    వాటే వర్డిక్ట్..

    బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ స్పందిస్తూ.. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము.. గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ వివాదం సమసిపోయింది.. అంటూ ట్వీట్ చేశాడు. ప్రముఖ నటి కోయినా మిత్ర ట్వీట్ చేస్తూ.. వాటే వర్డిక్ట్( ఏమీ తీర్పు.. ) నరేంద్ర మోదీకి ధన్యవాదాలను తెలిపింది.

    ధృడమైన దేశాన్ని నిర్మించాలి..

    ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ స్పందిస్తూ.. శాంతంగా ఉంటూ.. ఐకమత్యాన్ని చాటిచెబుతూ ఈ సమయంలో మహాత్మ గాంధీని గౌరవించుకోవాలి అంటూ ట్వీట్ చేశాడు. నటుడు కునాల్ కపూర్ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి సమయంలో అందరం శాంతంగా ఉండాలి.. సున్నితంగా ఉంటూ ధృడమైన, ఐకమత్య దేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చాడు.

    అందరూ గౌరవించాలి..

    ప్రముఖ నటి హ్యూమా ఖురేషి స్పందిస్తూ.. భారత ప్రజలు సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలి.. ఒకరొకరు నిలుస్తూ.. మనందరిదీ ఒకే దేశంగా భావించి ముందుకు కదలాలి అని పేర్కొంది. ప్రముఖ నటుడు, నిర్మాత ఫర్హాన్అక్తర్ స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలి. మనకు వ్యతిరేకంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా అంగీకరించాలి.. మనందరం ఒక్కటే అనే విధంగా ఈ దేశం ముందుకు కదలాలి.. జై హింద్ అని ట్వీట్ చేశాడు.

    మిగతా సమస్యలపై దృష్టి సారించాలి..

    వీరందరిలో తాప్సీ చేసిన ట్వీట్ మాత్రం వైరల్ అవుతోంది. అయోధ్య కేసుపై ఉన్నత ధర్మాసం ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తూ దేశమంతా సందడిగా ఉంటే.. తాప్సీ మాత్రం వెటకారంగా ఓ ట్వీట్ చేసింది. ‘అవును.. ఇది అయిపోయింది.. తరువాత?' అంటూ కౌంటర్ వేసినట్టుగా ట్వీట్ చేసింది. మళ్లీ కొద్దిసేపటి తరువాత మరో ట్వీట్ చేస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు వచ్చేసింది..ఇక మిగతా సమస్యలపై పోరాడాలి.. జీవించడానికి అనుకూలంగా ఉండేట్టు మన దేశాన్ని నిర్మించుకోవాలి అంటూ పిలుపునిచ్చింది.

    English summary
    Bollywood Celebraties Response to Supreme Court Verdict On Ayodhya Case. Madhur Bandarkar, Farhan Akthar, Vivek Oberoi, Huma Khureshi And Taapsee Are Reacted on Verdict.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X