టాప్ హీరోయిన్లతో దొరలా ఫోజులు, మోసం చేసి దొంగలా జంప్... (ఫోటోస్)
ఖరీదైన వజ్రాలతో వ్యాపారాలు చేశాడు, నిన్న మొన్నటి వరకు రాజాలా విలాసవంతంగా గడుపుతూ పెద్దమనిషిగా చెలామణి అయ్యాడు. బాలీవుడ్ సెలబ్రిటీలతో ఫోజులు కొట్టాడు. ఇపుడు బ్యాంకుకు వేల కోట్ల రూపాయల పంగనామం పెట్టి పరారయ్యాడు. అతడే డైమండ్ జ్యువెల్లర్ నిరవ్ మోడీ. పాపం అతగాడి అసలు రూపం తెలియక ప్రియాంక చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రా, సోనమ్ కపూర్, లీసా హెడెన్, నిమ్రత్ కౌర్ లాంటి తారలు 'నీరవ్ మోడీ' డైమండ్ బ్రాండ్ తరుపున ప్రచారం చేశారు. తన బ్రాండ్ ప్రచారం కోసం నీరవ్ మోడీ హాలీవుడ్ తారలు రోసీ హంటింగ్టన్, కెనడియన్ సూపర్ మోడల్ కోకో రోచా లాంటి వారిని సైతం రంగంలోకి దించాడు. ఇపుడు బ్యాంకులతో పాటు ప్రియాంక చోప్రా లాంటి తారలకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు.

సోనమ్ కపూర్
దేశంలోనే అతిపెద్ద జ్యువెల్లర్‌గా నిరవ్ మోడీ చలామణి అయిన సమయంలో అతడితో కలిసి బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. ఇటీవలే నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 11 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.

లీసా హెడెన్
నీరవ్ మోడీతో కలిసి బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో లీసా హెడెన్. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణం ఎగ్గొట్టిన విషయంలో తనను అరెస్టు చేస్తారని ముందే గ్రహించిన నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయాడు.

మాల్యాను మించిపోయాడు
ఇప్పటి వరకు దేశంలో 9వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా అతిపెద్ద డిఫాల్టర్. అయితే నీరవ్ మోడీ అతడిని సైతం మించి పోయాడు. రూ. 11 వేల కోట్లు ముంచేసి విజయ్ మాల్యా బాటలోనే విదేశాలకు పారిపోయాడు.

బ్యాంకింగ్ సిస్టంలో లోపాలే
బ్యాంకింగ్ సిస్టంలో లోపాలే నీరవ్ మోడీ ఇంత పెద్ద ఫ్రాడ్ చేయడానికి కారణమైంది. వాటిని బాగా ఉపయోగించుకుని దేశం దాటేశాడు.

నిమ్రత్ కౌర్
నీరవ్ మోడీతో కలిసి డైమండ్ జ్యువెల్లరీ ప్రమోషన్లో బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్.

ప్రియాంక చోప్రాకు బకాయిలు
‘నిరవ్ మోడీ' బ్రాండ్‌కు ప్రచారం చేసిన వారిలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఒకరు. నీరవ్ మోడీ కేవలం బ్యాంకులకు పంగనామం పెట్టడమే కాదు, ప్రియాంక చోప్రాకు కూడా బ్రాండ్ ప్రమోషన్ చేసినందుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. దీంతో ఆమె నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

హాలీవుడ్, బాలీవుడ్
హాలీవుడ్ మరియు బాలీవుడ్ తారలతో నీరవ్ మోడీ తన జ్యువెల్లరీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయించారు.

లీసా, నిమ్రత
గతంలో నీరవ్ మోడీ బ్రాండ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న బాలీవుడ్ నటీమనులు లీసా హెడెన్, నిమ్రత్ కౌర్.

ప్రియాంక ఫోటోలతో హోర్డింగులు
ప్రియాంక చోప్రా ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులను ఇక్కడ చూడొచ్చు. దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఈ హోర్డింగులు ఏర్పాటు చేశారు.

రోసీ హంటింగ్టన్
కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ తన బ్రాండ్ విస్తరించాలనే ఉద్దేశ్యంతో హాలీవుడ్ నటీమణులతో నీరవ్ మోడీ ప్రమోషన్స్ నిర్వహించారు.

ఫోటోలకు ఫోజులు
ప్రచార కార్యక్రమాల్లో సినీ తారలతో నీరవ్ మోడీ ఫోజులు.

అతడి కోసం గాలింపు
నీరవ్ మోడీ ఇపుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఎవరికీ తెలియడం లేదు. అతడి కోసం పోలీసులు విదేశాల్లో సైతం గాలిస్తున్నారు. అతడిని అరెస్టు చేసి ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











