twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #మీటూ: ఇలాంటి జీవితం నాకొద్దంటూ ఆత్మహత్యాయత్నం!

    |

    #మీటూ ఉద్యమంలో భాగంగా నలుగురు మహిళలు సెలబ్రిటీ మేనేజ్మెంట్ ఏజెన్సీ 'క్వాన్ ఎంటర్‌టైన్మెంట్' సహ వ్యవస్థాపకుడు, సెలబ్రిటీ మేనేజర్ అనిర్బన్ దాస్ బ్లా మీద కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలతో మనస్తాపం చెందిన అనిర్బన్ దాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

    ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత సూసైడ్ నోట్ రాసిన న అనిర్బన్ అది మీడియా రిపోర్ట్స్ కంటపడేలా ప్లాన్ చేశాడు. అందులో తాను ఎక్కడ, ఎలా ఆత్మహత్య చేసుకోబోతున్నాను, చనిపోయిన తర్వాత నన్ను ఎలా గుర్తు పట్టడం, నేను ఏ రంగు దుస్తులు వేసుకున్నాను అనే విషయాలు సైతం వెల్లడించారు.

     ఆత్మహత్య అంటూ ముందే సమాచారం ఇచ్చి

    ఆత్మహత్య అంటూ ముందే సమాచారం ఇచ్చి

    ముంబైలోని వశీ పాత వంతెన వద్ద తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సమాచారం మీడియాకు, పోలీసులకు అనిర్బన్ ముందే సమాచారం అదేలా ప్లాన్ చేయడంతో.... సరిగ్గా అతడు వంతెన వద్దకు వచ్చి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న సమయంలో సినీ పక్కీలో కాపాడారు. శుక్రవారం 12.30(am) సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

    డిప్రెషన్లో అనిర్బన్

    డిప్రెషన్లో అనిర్బన్

    9 మంది భాగస్వాములతో కలిసి అనిర్బన్ ‘క్వాన్ ఎంటర్‌టైన్మెంట్' సంస్థను నెలకొల్పాడు. నలుగు అమ్మాయిలు అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ‘క్వాన్' నుంచి తప్పుకోవాలంటూ ఒత్తిడి పెరిగిందట. ఈ పరిణామాలే అతడిని ఆత్మహత్య వైపు నడిపించారని చర్చించుకుంటున్నారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా దారుణంగా ఉన్నాయని, అందులో నిజం లేదని తెలిపారు.

    #మీటూ ఉద్యమంలో తొలి షాక్

    #మీటూ ఉద్యమంలో తొలి షాక్

    అనిర్బన్ ఆత్మహత్య యత్నంతో #మీటూ ఉద్యమానికి తొలి షాక్ తగిలినట్లయింది. ఈ సంఘటన తర్వాత మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ప్రముఖల పేర్లు తెరపైకి

    ప్రముఖల పేర్లు తెరపైకి

    #మీటూ ఉద్యమం ఉధృతం అయిన తర్వాత అను మాలిక్, సుభాష్ ఘాయ్, సాజిద్ ఖాన్, వికాస్ బహల్, అలోక్ నాథ్ లాంటి వారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇటు సౌత్‌లో ప్రముఖ సినీ రచయిత వైరముత్తు, మ్యూజిక్ కంపోజర్ రఘు దీక్షిత్ పేర్లు తెరపైకి వచ్చాయి.

    English summary
    Anirban Blah, the co-founder of Kwan Entertainment which is one of the biggest celebrity management agencies in India, allegedly tried to commit suicide by jumping off a bridge in Navi Mumbai. The incident happened at around 12.30 am when traffic police got a tip-off about the alleged suicide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X