twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నీచులను ఉరి తీయాలి: ట్వింకిల్ శర్మ ఘటనపై సినీ ప్రముఖులు

    |

    ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ట్వింకిల్ శర్మ అనే చిన్నారి దారుణ హత్యకు గురైన సంఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తోంది. కిడ్నాప్ అయిన మూడు రోజుల తర్వాత తుప్పాల్ ఏరియాలో ట్వింకిల్ శర్మ మృతదేహం సగం కాలిపోయి కనిపించింది. ట్వింకిల్ వయసు మూడేళ్లు. ఈ హత్య కేసులో నిందితుడు మహ్మద్ జాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ట్వింకిల్ తల్లిదండ్రులు జాహిద్‌కు రూ. 10వేల రూపాయలు అప్పు ఉన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ ఈ హత్యకు దారితీసినట్లు భావిస్తున్నారు.

    ఈ కేసులో జాహిద్‌తో పాటు అతడికి సహకరించినట్లు అనుమానిస్తున్న అస్లాం అనే మరో వ్యక్తిని జూన్ 4 పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చిన్నారిపై అత్యాచారం జరుగలేదని పోలీసులు తేల్చారు. చిన్నారి మృతదేహం స్వాధీనం చేసుకునే సమయానికి సగం కాలిపోయి ఉండటంతో పాటు కుక్కలు పీక్కు తింటున్నాయి. ఈ దారుణంపై బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు.

    వారిని ఉరితీయాలంటున్న రవీనా టండన్

    అలీగఢ్‌లో మూడేళ్ల చిన్నారి హత్యోదంతం నన్ను చాలా బాధించిందని రవీనా టండన్ పేర్కొన్నారు. క్రిమినల్స్ ఆమె కళ్లను కూడా పీకి హత్య చేశారని తెలిసి షాకయ్యాను. వాళ్లు మనుషులు కాదు. ఇలాంటి వారు ఈ సమాజంలో ఉండటానికి అర్హులు కారు. ఉరితీయాలి. ఈ విషయంలో న్యాయస్థానాలు త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

    అభిషేక్ బచ్చన్

    అభిషేక్ బచ్చన్

    చిన్నారి ట్వింకిల్ శర్మ హత్య విషయం తెలిసి చాలా బాధేసింది. ఇలాంటి దారుణాలు పాల్పడే వారికి మానవత్వం ఉండదేమో అనిపిస్తుంది. దీనిపై ఎలా స్పదించాలో అర్థం కావడం లేదు అని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు.

    ఆయుష్మాన్ ఖురానా

    ఆయుష్మాన్ ఖురానా

    ఇది అమానవీయ చర్య. ట్వింకిల్ శర్మ తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ విషయంలో వారికి న్యాయం జరుగాలని కోరుకుంటున్నట్లు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా పేర్కొన్నారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని ట్వీట్ చేశారు.

    సిద్ధార్థ్ మల్హోత్రా

    సిద్ధార్థ్ మల్హోత్రా

    ట్వింకిల్ శర్మ న్యూస్ విని చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్న చోట చిన్నారులకు రక్షణ ఉండదు. ఇలాంటి నేరాలు మళ్లీ జరుగకుండా నిందితులకు కఠినమైన శిక్షలు వేయాలని కోరుకుంటున్నట్లు సిద్ధార్థ్ మల్హోత్రా ట్వీట్ చేశారు.

    గుల్ పనాగ్

    గుల్ పనాగ్

    మన దేశంలో పసిబిడ్డలకు కూడా రక్షణ లేదని తెలిసి భయం వేస్తోంది. ట్వింకిల్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ దారుణాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్లు గుల్ పనాగ్ ట్వీట్ చేశారు.

    సన్నీ లియోన్

    సన్నీ లియోన్

    ట్వింకిల్ శర్మ హత్యోదంతం సన్నీ లియోన్‌ను కూడా కదిలిచింది. హ్యూమానిటీ లేని సమాజం నుంచి ఆమె దూరంగా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఇలాంటి దారుణం జరిగినందుకు చాలా బాధగా ఉందంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేశారు.

    English summary
    "The horrible, barbaric rape,murder of a 3 year old In Aligarh,the criminals,who gouged her eyes, mutilated her body,depraved evil,inhuman & barbaric. Must Hang. The law must act fast!" Raveena Tandon tweeted. Toddler Twinkle Sharma was murdered in Aligarh after her parents couldn't repay a loan of Rs 10,000.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X