Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షూటింగ్స్ లేక రోడ్లపై పండ్లు అమ్ముకుంటున్న నటుడు.. మరీ ఇంత దారుణమా?
సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ గా ఎంత బిజీగా మారినా కూడా కొన్నిసార్లు ఊహించని విధంగా అవకాశాలు తగ్గిపోతుంటాయి. ఇండస్ట్రీలో రాజభోగాలు అనుభవించిన స్టార్ హీరో హీరోయిన్లే ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవకాశాల కోసం ఫిల్మ్ నగర్ లో చాలా మంది ఇంకా ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. అయితే ఒక యువ నటుడు కూడా అవకాశాలు లేక రోడ్ల మీద పండ్లు అమ్ముకుంటున్నాడు.
Recommended Video
కరోనా దెబ్బ..
కరోనా వైరస్ కారణంగా చాలా మంది జీవితాలు ఊహించని మలుపులు తిరిగాయి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో పేద కళాకారులకు రోజు గడవడమే కష్టంగా మారింది. సినీ పెద్దలు సహాయం అందిస్తున్నప్పటికి అది అందరికి ఎక్కువ రోజులు ఉపయోగపడటం లేదు.
పండ్లు ఆముకుంటున్న నటుడు..
బాలీవుడ్ కి చెందిన ఒక నటుడు రోడ్డు మీద పండ్లు అమ్ముకోవడం ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో నటించిన సోలంకి దివాకర్ ఒక తోపుడు బండిపై పండ్లు అమ్మడం వైరల్ గా మారింది.
ఫ్యామిలీ కోసం..
డ్రీమ్ గర్ల్ సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన దివాకర్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 35 ఏళ్ల ఈ సినీ యాక్టర్ గతంలో పండ్ల వ్యాపారం చేశాడట. సినిమా అవకాశాల కోసం బాలీవుడ్ బాట పట్టిన ఇతను చిన్న చిన్న అవకాశాలతో ఇన్నాళ్లు ఫ్యామిలీని నడుపుకుంటు వస్తున్నాడు. ఇక ఇప్పుడు షూటింగ్స్ లేకపోవడంతో ఇలా రోడ్ల మీద పండ్లు అమ్ముకుంటున్నాడు.
కష్టాలు తప్పడం లేదు.
ఇంటి అద్దె కట్టుకొని నా ఫ్యామిలీని నడపాలి అంటే ఎదో ఒక పని చేయక తప్పదు. అందుకే ఈ విధంగా పండ్ల వ్యాపారం స్టార్ట్ చేశాను అని దివాకర్ చెబుతున్నారు. నెక్స్ట్ బాలీవుడ్ లో తెరకెక్కనున్న చిన్న చిన్న సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఇంకా షూటింగ్స్ స్టార్ట్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడట ఈ యాక్టర్. కొన్ని సినిమాలు ఇప్పట్లో స్టార్ట్ కాకపోవచ్చని, మరికొన్ని క్యాన్సిల్ కావచ్చని కూడా వివరణ ఇచ్చాడు దివాకర్.