బాలీవుడ్ సెక్స్ రాకెట్: డాన్స్ షోల ముసుగులో బలవంతంగా వ్యభిచారం, చేయించేది ఆవిడే?
ముంబై సిటీ పోలీసులు మరో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ వ్యవహరాన్ని బట్ట బయలు చేశారు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ కొరియోగ్రాఫర్ డాన్స్ అసైన్మెంట్స్ పేరుతో అమ్మాయిలను విదేశాలకు పంపుతూ వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారాన్ని బయట పెట్టారు.
క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం ఆగ్నెస్ హామిల్టన్ అనే 56 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌ను అరెస్ట్ చేశారు. అంధేరిలోని లోఖండ్ వాలాలో డాన్స్ క్లాసులు రన్ చేస్తున్న ఆమె యాక్టర్లు అవ్వాలని వచ్చే వారిని మభ్యపెట్టి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గతంలో పలు బాలీవుడ్ చిత్రాలకు
ఆగ్నెస్ హామిల్టన్ గతంలో బాలీవుడ్లో పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేయడంతో పాటు కొన్ని సినిమాల్లో ఆమె డాన్సర్‌గా కూడా నటించారు. ఆమె ఫేస్ బుక్ పేజీలో పలువురు బాలీవుడ్ నటులు, పొలిటీషియన్లతో దిగిన ఫోటోలు సైతం దర్శనమిస్తున్నాయి.

వివిధ సెక్షన్ల కింద కేసు
ఇండియా నుంచి మలేషియాకు అందమైన అమ్మాయిలను డాన్స్ అసైన్మెంట్స్ పేరుతో పంపుతోందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు హామిల్టన్ మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అలా గుట్టు రట్టు
కొన్ని సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా సాగుతోంది. అయితే ఇటీవల కెన్యా ప్రభుత్వం అక్రమంగా తమ దేశానికి వచ్చిన ఓ మహిళను పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ గతేడాది హామిల్టన్ డాన్స్ క్లాసులకు హాజరైంది.

వారితో బలవంతంగా
కెన్యా హోటళ్లలో తనకు మంచి పని దొరుకుతుందని హామిల్టన్ తనకు చెప్పి పంపిందని...నేను కెన్యా చేరుకున్న తర్వాత తనను ఒక వ్యక్తి నైరోబి తీసుకెళ్లి వ్యభిచారం చేయాలని బలవంతం చేశారని సదరు మహిళ వెల్లడించింది. దీని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు హామిల్టన్ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ దందా బయట పెట్టారు.


Click it and Unblock the Notifications











